Cinema

‘మ‌హాస‌ముద్రం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది

‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం ఎన్ని మలుపులు తిరిగిందో తెలియంది కాదు. ఎట్టకేలకు శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి తన రెండో చిత్రాన్ని ప్రకటించారు. ‘మ‌హాస‌ముద్రం’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.

తాజాగా ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ అంద‌రిలోనూ కుతూహ‌లాన్ని క‌లిగిస్తోంది. శ‌నివారం మ‌హాస‌ముద్రం రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. ఆ పోస్ట‌ర్‌లో స‌ముద్రం ఒడ్డున ఉన్న ఓ బోట్‌పై ఒక‌రికొక‌రు వీపులు చూపిస్తూ కూర్చొని సిగ‌రెట్ తాగుతున్న ఇద్ద‌రు హీరోలు క‌నిపిస్తున్నారు.

నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తొలిసారిగా ఓ అపురూప‌మైన ప్రేమ‌క‌థ‌ను త‌మ బ్యాన‌ర్‌పైన అందిస్తున్నామ‌ని చెప్పారు. ‘‘ఇన్నేళ్లుగా మీరెందుకు ఓ ల‌వ్ స్టోరీని నిర్మించ‌డం లేద‌ని ప్ర‌తి ఒక్క‌రూ న‌న్ను అడుగుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు మేం ఎప్ప‌టికీ గ‌ర్వ‌ప‌డే ఓ అపురూప‌మైన, అపార‌మైన ల‌వ్ యాక్ష‌న‌ర్‌ను అందిస్తున్నాం. 19 ఆగ‌స్ట్ 2021న తీ రాల‌ను ఢీకొట్ట‌డానికి ‘మ‌హాస‌ముద్రం’ వ‌స్తోంది’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ప్ర‌వీణ్ కె.ఎల్‌. ఎడిట‌ర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM