Cinema

‘ఖిలాడి’ కూడా ఖరారయ్యాడు

మాస్ మహారాజా హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’. ‘క్రాక్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, ‘రాక్ష‌సుడు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మే 28న విడుద‌ల‌ చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మాస్ రాజా ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. ఏ స్టూడియోస్‌తో క‌లిసి డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌‌ర్ప‌ణ‌లో.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ప్లే స్మార్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ.. శ‌నివారం మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మే 28న చిత్రం విడుద‌ల‌వుతోంద‌ని తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్ట‌ర్‌లో టాప్ టు బాట‌మ్ బ్లాక్ డ్ర‌స్‌లో, బ్లాక్ గాగుల్స్‌, బ్లాక్ షూస్‌తో, చేతిలో రివాల్వ‌ర్‌తో రోడ్డు మీద న‌డ‌చుకుంటూ వ‌స్తున్న ర‌వితేజ స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఆయ‌న చుట్టూ క‌రెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ ఉన్నాయి. ఇంత‌కుముందు ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసిన వీడియో గ్లిమ్స్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు మంచి ట్రీట్ కానున్న‌ద‌ని ఈ గ్లిమ్స్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చేశారు.

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తోంది. ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ర‌మేష్ వ‌ర్మ ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చిదిద్దుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ కానుందని, సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారని చిత్రయూనిట్ తెలిపింది. అలాగే ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకి మరో అస్సెట్ కానుందని వారు ప్రకటనలో తెలిపారు. శ్రీ‌కాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM