Cinema

24 గంటల్లోనే.. ఓటీటీలోనూ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు, డిజిటల్ వరల్డ్ లో మరో రికార్డును బద్దలు కొట్టింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో అదరగొడుతోంది. ZEE5లో ప్రీమియర్ తెలుగు సినిమా ఇంతకు ముందు ఎన్నడూ చూడని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది

డిజిటల్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే, MSG 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది, ఇది ప్లాట్‌ఫామ్‌లో ఒక తెలుగు చిత్రానికి ఇప్పటివరకు లభించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన నెంబర్ సినిమాపై ప్రేక్షకులలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. బాక్సాఫీస్‌ను ఏలిన సినిమాలు కూడా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అరుదుగా మాత్రమే బిగ్ నెంబర్స్ సాధిస్తాయి, ఇప్పుడు MSG అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది.

ఈ సెన్సేషనల్ రెస్పాన్స్ కి మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన కామిక్ టైమింగ్ ప్రధాన పాత్ర పోషించాయి. ఆయన కరిజ్మా ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది. అనిల్ రావిపూడి కలర్‌ఫుల్ కామెడీ, హార్ట్‌ఫెల్ట్ డ్రామాతో రూపొందిన MSG థియేటర్లలతో పాటు ఓటీటీలో కూడా సమానంగా అలరిస్తోంది.

షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM