Cinema

‘ఎన్టీఆర్ నీల్’.. ఏప్రిల్ 22 నుంచి షూట్ లో పాల్గొంటున్న తారక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకున్న మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కెజియఫ్, సలార్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను రూపొందించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ యాక్షన్ ఎపిక్ మూవీ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రీసెంట్‌గా ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.

ఈ క్రేజీ మూవీ సెట్స్‌లోకి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని అభిమానులు సహా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. ఏప్రిల్ 22 నుంచి షూటింగ్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ పాల్గొంటున్నారు. దీని కోసం ఆయన హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళుతున్నారు. రోజు రోజుకీ ఈ కాంబోపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ చిత్రీకరణలో పాల్గొనబోతుండటంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయ్యింది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయిక వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సెట్స్‌లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నారనే వార్త ఆయన అభిమానులు, ప్రేక్షకులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ యూనిక్ మాస్ విజన్‌తో ఎన్టీఆర్‌ను సరికొత్త మాస్ అవతార్‌లో చూపించబోతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయనుంది.

ఈ ప్రెస్టీజియస్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా… ప్రొడక్షన్ డిజైనర్‌గా చలపతి వర్క్ చేస్తున్నారు. వీరితో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణఉలు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనున్నారు.

నటీనటులు – మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

సాంకేతిక వర్గం :

నిర్మాతలు – కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు
రచన, దర్శకత్వం – ప్రశాంత్ నీల్
సంగీతం – రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ – భువన్ గౌడ
ప్రొడక్షన్ డిజైన్ – చలపతి

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM