Cinema

’సోదరా‘ నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది: హీరోలు సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌

వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సంపూర్ణేష్ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర కథానాయకులు సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌లు మీడియాతో ముచ్చటించారు.
సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ… ” అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. ఇది నా గత చిత్రాల తరహాలో ఉండదు. ఇది కుటుంబ కథ ఇద్దరూ అన్నదమ్ముల కథ. అన్నగా బరువు బాధ్యతలు ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషించాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరికి తమ రియల్‌లైఫ్‌ సంఘటనలు గుర్తుకు వస్తాయి. నా రియల్‌లైఫ్‌లో ఉండే నరసింహా చారికి ఈ చిత్రంలో చేసిన పాత్రకు దగ్గరి పోలికలు ఉంటాయి. మొదటి మూడు నాలుగురోజులు ఈ పాత్రను పోషించడానికి ఇబ్బంది పడ్డాను. నాకు వేరే సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుండేవి. అయితే క్యారెక్టర్‌లోని మూడ్‌ పోకూడదని ఈ సినిమాలో నా పాత్ర కంప్లీట్‌ అయిన తరువాతే ఇతర సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నాను. ఈ చిత్రంలో జనరల్‌గా నా సినిమాలో ఉండే వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ తమ అన్నాదమ్ములకు ఫోన్‌ చేస్తారు. హృదయకాలేయంలో ఉన్న కామెడీ మాత్రం ఉండదు. ఇందులో ఉండే వినోదం కూడా ఎంతో ఆహ్లాదంగా ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా ఉంటుంది. అందరూ హృదయ కాలేయం లాంటి సినిమాలు మళ్లీ మీ నుంచి ఎందుకు రావడం లేదు? అంటున్నారు. అయితే ఆ స్థాయికు తగ్గ కథలు దొరకడం లేదు. ఈ మధ్య కథలు విన్నాను. కానీ పెద్దగా నాకు ఎక్కలేదు. హృదయాకాలేయం మించిన కామెడీ కథ దొరికితే చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాను. సూపర్‌ సుబ్బు అనే వెబ్‌సీరిస్‌లో కూడా నటించాను.’ నటుడిగా చాలా తరహా పాత్రలు చేయాలని ఉంది. ఏ అనే సినిమాలో ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఉంది. అన్నారు.

మరో కథానాయకుడు సంజోష్‌ మాట్లాడుతూ… ” నేను ఇంతకు ముందు బేవరస్‌ అనే సినిమాలో హీరోగా నటించాను. సంపూతో కలిసి ఓ బ్రదర్‌గా ఈ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే కథ ఇది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి దర్శకుడు ఈ సినిమాకు బ్రోమాంటిక్‌ అని ట్యాగ్ పెట్టాడు. ఇది అమాయకుడైన అన్న, అప్‌డేట్ అయినా తమ్ముడి కథ. ఇలాంటి అన్నదమ్ముల కథతో ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా రాలేదు.ఈ సినిమా చూసిన తరువాత అందరూ కనెక్ట్‌ అవుతారు. సినిమా పూర్తవగానే అన్నకు తమ్ముడు, తమ్ముడు అన్నకు తప్పనిసరిగా ఫోన్‌ చేసి మాట్లాడుతాడు. అంతలా అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఎమోషనల్‌ అన్నదమ్ములు కలిసి ఉండాలి అనికోరుకునే కథ ఇది. అందరికి తమ రియల్‌లైఫ్‌ గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో బాబుమోహన్‌ పాత్ర చాలా బాధ్యత గల రోల్‌. మాకు ఫాదర్‌గా నటించాడు, నాకు ఇంతకుముందే సంపూతో పరిచయం ఉన్నది. ఈ పాత్రకు సంపూకు సరిపోతుందని, ఆయన చేస్తే సర్‌ప్రైజ్‌గా ఉంటుందని అనుకున్నాం. సంపూ కూడా కథ వినగానే ఓకే అన్నాను. రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతారు . స్వచ్చతకు మారుపేరుగా అన్నదమ్ముల అనుబంధంగా ఉండాలి. ఈ రోజుల్లో మాత్రం అలాంటి అనుబంధం కరువైపోయింది. ఎక్కడో కానీ అలాంటి అనుబంధాలు చూడటం లేదు. ఈ సినిమా చూసిన తరువాత ఒకరిద్దరూ మారిన మాకు సంతోషమే. ఈ సినిమాలో అన్నదమ్ముల అనుబంధం అందరిని నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. సంపూ నేను మంచి వ్యక్తిత్వాలు ఉన్న మనుషులం. మా ప్రయాణ బాగుంది. ఇక త్వరలోనే నేను సోలో హీరోగా రియల్‌ ఇన్‌సిడెంట్‌ కథతో సినిమా చేస్తాను. ఒక ఇగోయిస్ట్‌ పోలీస్‌ఆఫీసర్‌కు కామన్‌ మ్యాన్‌కు జరిగే కథతో సినిమా ఉంటుంది’ అన్నారు.

Share
Published by
admin

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM