Cinema

‘వకీల్‌ సాబ్‌’.. పవన్‌ స్పీడ్‌ చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే అభిమానుల్లో పూనకాలోచిస్తాయి. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ వెళ్లిన తరువాత ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘‘వకీల్ సాబ్’’. ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మించగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు (శనివారం) కంప్లీట్ చేశారు. దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌,
సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌,
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి,
డైలాగ్స్‌: తిరు,
యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌,
వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌,
కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి,
స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌,
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ ,
మాటలు-మార్పులు-ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM