Cinema

రామ్‌ చరణ్‌, శంకర్ కాంబో‌.. సంచలన వార్త వచ్చేసింది

Ram Charan and Shankar:’ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఏం సినిమా చేస్తాడా? అని ఎదురు చూస్తున్న మెగాభిమానులకు కనీవినీ ఎరుగని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు రామ్‌ చరణ్‌. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌తో తన తదుపరి చిత్రం ఉంటుందని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా.. జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు, ఇండియ‌న్‌, జీన్స్‌, ఒకే ఒక్క‌డు, అప‌రిచితుడు, రోబో, 2.0 వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రాన్ని సెట్‌ చేసింది ఎవరో తెలుసా? సూపర్‌ హిట్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొంద‌నుంది.

ఈ ప్రకటన అనంతరం నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ.. ”సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు ద‌శాబ్దాల‌వుతుంది. ఈ జ‌ర్నీలో మా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నుంచి స్టార్ హీరోల‌తో, అప్ క‌మింగ్, డెబ్యూ హీరోల‌తో, ద‌ర్శ‌కుల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిరంగా నిలిచిపోయే చిత్రాలను రూపొందించాం. ఇప్పుడు మా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 50వ సినిమాను మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌గారితో నిర్మిస్తున్నాం. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న‌ 15వ చిత్ర‌మిది.

ద‌క్షిణాది సినిమా స్థాయిని ఇటు స‌బ్జెక్ట్ ప‌రంగా, అటు సాంకేతికంగా నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లిన‌ భారీ చిత్రాల సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాను మా బ్యాన‌ర్‌లో నిర్మించ‌నున్నాం. చ‌ర‌ణ్‌, శంక‌ర్ వంటి క్రేజీ కాంబినేష‌న్‌లో ప్యాన్ ఇండియా మూవీ అంటే.. సినిమాపై ఎలాంటి భారీ అంచనాలుంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. సినీ ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా ఈ ప్యాన్ ఇండియా మూవీని రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు. రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ట్విట్టర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM