Cinema

షాక్: తనపై అత్యాచారం జరిగిందని పబ్లిక్‌గా చెప్పిన నటి..!

ఆడవాళ్లపై తరచూ లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ మహిళలే కాదు… సెలబ్రిటీల పై కూడా ఈ లైంగిక వేధింపులు జరుగుతున్నట్లుగా ఈ మధ్య కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై సినిమా ఇండస్ట్రీలో మీటూ అంటూ ఓ ఉద్యమం కూడా నడిచింది. లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యంగా ముందుకు వచ్చి మీటూ అంటూ చెబుతున్నారు. కానీ ఈ ఉద్యమాన్ని కూడా కొందరు నీరుకార్చారు. కానీ కొంతమంది ఈ వేధింపుల్ని మర్చిపోవడం అనేది సాధ్యం కానీ పని. అది కూడా ఏమి తెలియని చిన్న తనంలో జరిగినవి ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. అటువంటి ఒక సంఘటన ఓ నటి జీవితంలో కూడా ఎదురైందని ఆ నటి చెప్పుకొచ్చింది.

సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, ఒకప్పటి బాలీవుడ్ నటి సోమి అలీ తన 5 సంవత్సరాల వయస్సులో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పింది. పాకిస్థాన్ లో మొదటిసారిగా తనపై లైంగిక వేధింపులు జరిగాయని, వాళ్ళు ఉంటున్న క్వార్టర్స్ లో తనపై ఒక సేవకుడు మిస్ బీహేవ్ చేశాడని, ఆ విషయం గురించి తన తల్లిదండ్రులతో చెప్పిన అతనిపై చర్యలు తీసుకున్నారు కానీ.. బయటికి విషయం రాకుండా జాగ్రత్తగా పడ్డారని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తనకు అప్పట్లో చెప్పారని.. సోమీ అలీ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక 14 సంవత్సరాల వయసులో కూడా తనపై అత్యాచారం జరిగిందని సోమి వాపోయింది.

ప్రస్తుతం ఈమె ‘నో మోర్ టియర్స్’ అనే స్వచ్చంధ సంస్థను స్థాపించి, అత్యాచారానికి గురైన వారిని, తనలా లైంగిక వేధింపులను అనుభవించిన వారికీ అండగా ఉంటుంది. ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తనపై జరిగిన వేధింపుల గురించి మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా వీటి గురించి మాట్లాడుతున్నానని, ఇప్పటికి మాట్లాడకపోతే నేను తప్పు చేస్తున్నట్లే అవుతుందనే.. ఇప్పుడు నోరు విప్పుతున్నానని తెలిపింది.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM