Cinema

మెగాస్టార్ మూవీలో పూర్తిస్థాయిలో కనిపించనున్న సత్యదేవ్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది. ఈ చిత్రానికి చాలా ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా గాడ్‌ఫాదర్‌లో నటుడు సత్యదేవ్ కీలకమైన, పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.’ఆచార్య’ సినిమాలో తాను ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ..“అన్నయ్యా, నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది” అని ట్వీట్ చేశారు సత్యదేవ్.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఓ ఫోటో గ్రాఫ్ ని అభిమానులతో పంచుకున్నారు.

దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ,..“డియర్ సత్యదేవ్ ..థ్యాంక్ యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#గాడ్ ఫాదర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you. God bless! ” అని రీట్వీట్ చేశారు మెగాస్టార్.

టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్ కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు.

ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్పణ: కొణిదెల సురేఖ
బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
డీవోపీ: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు
పీఆర్వో: వంశీ-శేఖర్

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM