Cinema

ఇంద్ర రామ్ ‘చౌర్య పాఠం’ నుంచి కొత్త పాట విడుదల

ధమాకాతో మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన అప్ కమింగ్ క్రైమ్ కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’ తో నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన  సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ‘చౌర్య పాఠం’ ఫస్ట్ సింగిల్ తెలిసి తెలిసి పాటని విడుదల చేసి మ్యూజికల్ జర్నీని ప్రారభించారు మేకర్స్. డేవ్ జాంద్ ఈ పాటని సోల్ ఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని మనసుని హత్తుకునే లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, హరిచరణ్ తమ అద్భుతమైన వోకల్స్ తో ఆకట్టుకున్నారు.

ఈ పాటలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ కెమిస్ట్రీ మెస్మరైజింగ్ గా వుంది. విజువల్స్ చాలా ప్లజెంట్ గా వున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలించేలా వున్న ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించడంతో పాటు డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ కాగ, ఉత్తర ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.

తారాగణం: ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్, ఎడ్వర్డ్ పెరేజీ, సుప్రియ ఐసోలా, క్రీష్ రాజ్, సహదేవ్ తదితరులు

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM