Health

వెల్లుల్లిని ఇలా వాడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి

Garlic: ఇప్పుడు మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు మనం వెల్లుల్లి ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. కానీ అదే వెల్లుల్లిని వాడే విధానం, ఎలా వాడితే ఎటువంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం. సహజంగా ఏ వస్తువు అయినా సరైన పద్దతిలో వాడినప్పుడే అందులో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో చక్కగా పని చేస్తాయి. తెలిసో, తెలియకో మనం చేసే చిన్న చిన్న తప్పులు మనకి హాని కలిగించేలా ఉంటాయి. అలాగే వెల్లుల్లి గురించి కూడా అటువంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలం పచ్చళ్ళకి చాలా ఫేమస్. చాలా మంది వేసవి వస్తుంది అంటే మామిడి, అల్లం, ఉసిరి, టమోటో లాంటి వాటితో నిల్వ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. కొంతమంది వెల్లుల్లితో కూడా ఇలా పికిల్ తయారు చేసి నిల్వ చేసుకుంటారు. కానీ అలా చేయడం అనేది ఎంత తప్పో తెలియదు వాళ్ళకి.

వెల్లుల్లిని సహజంగా కూరగా, లేదా మసాలాగా వాడుతుంటాం. అలా వాడడం అనేది సరైన పద్దతే. వెల్లుల్లిలో ఆరోగ్య విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్ అనే పదార్ధం వలన దానికి అంత మంచి రుచి, వాసన, ఘాటుతనం, ఔషధ గుణాలు వస్తాయి. ఈ వెల్లుల్లితో ఊరగాయ పెట్టడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిని ఎప్పుడు తాజాగానే తీసుకోవాలి. అప్పుడే అందులో ఉండే ఔషధ గుణాలు మన శరీరంపై చక్కగా ప్రభావం చూపిస్తాయి.

ఇందులో ఉండే ఎల్లిసిన్ వలన ఇమ్యూనిటీ లెవల్స్ పెరిగి, క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని నివారించే శక్తి తాజా వెల్లుల్లి ద్వారానే కలుగుతుంది. ఈ ఎల్లిసిన్ వెల్లుల్లిని కోసిన తరువాత నీటిలో ఆరు గంటలు, నూనెలో మూడు గంటలు మాత్రమే ఉంటుంది. కనుక ఈ ఎల్లిసిన్ మీ శరీరానికి పూర్తిగా ఉపయోగపడాలి అంటే మాత్రం దీనిని మీరు తాజాగానే ఉపయోగించాలి తప్ప ఊరగాయగా పెట్టుకోకూడదు.

వెల్లుల్లిని అలాగే రేకలుగా కాకుండా తరిగి కానీ, దంచి కానీ వాడుకోవాలి. తరిగిన వెల్లుల్లి కంటే.. దంచిన వెల్లుల్లిలో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. కనుక వెల్లుల్లి దంచి కాసేపు అలానే ఉంచిన తరువాత వాడుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది.

వెల్లుల్లి రోజు తినడం వలన ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని తెలుసు. కానీ చాలా మందికి ఆ వాసన సరిపడదు. దానిని అలాగే రేకలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులో కొంచెం ఉప్పు వేసి ఒక చిన్న కవర్లో ఆ ముక్కల్ని ఉంచి, చపాతీ కర్రతో రుద్దినట్లయితే ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు దానిని తినవచ్చు. ఆ తరువాత నోటి నుంచి వెల్లుల్లి వాసన పోవాలంటే కొద్దిగా సోంపుని తిన్నట్లైతే ఆ వాసన దూరమవుతుంది.

చూశారు కదా ఎవరైనా ఊరగాయ లాగా వాడుతున్నట్లైతే తక్షణమే మానేసి, కేవలం తాజాగా మాత్రమే వాడి వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాల్ని సంవృద్ధిగా వాడుకోవాలని ఆశిస్తున్నాం. మరో అప్‌డేట్‌లో మరిన్ని ఉపయోగాలు తెలుసుకుందాం.

Recent Posts

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM

విశ్వంభర లో నా కల నెరవేరింది: నటుడు ప్రవీణ్

తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ త‌రం న‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నిషియ‌న్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో…

April 4, 2025 at 8:04 PM

ఒక బృందావనం చిత్రం నుంచి లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల

ఈ మధ్య కాలంలో హృదయానికి హత్తుకునే సాహిత్యంతో.. మనసును తాకే స్వరాలతో.. మైమరిపించే నేపథ్య గానంతో వచ్చే పాటలు చాలా…

April 4, 2025 at 7:30 PM