Sports

ఐపీఎల్14 షెడ్యూల్ ఖరారు.. ఈసారి ఎక్కడంటే?

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే దేశవాళీ క్రికెట్‌ పండుగ ఐపీఎల్‌ షెడ్యూల్‌ దాదాపుగా ఖరారు అయిపోయిందట. వచ్చే నెల 9న ఐపీఎల్‌ 14వ సీజన్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ మే 30న జరిగుతుందని బీసీసీఐ వర్గాలు శనివారం వెల్లడించాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావల్సివుంది. ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌ ముగిసిన 12 రోజుల్లోనే.. మెగా క్రికెట్ లీగ్‌కు తెరలేవనుంది. అయితే, వచ్చే వారం జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో 2021 ఐపీఎల్‌ షెడ్యూల్‌, వేదికలపై తుది నిర్ణయాన్ని తీసుకుంటారని సమాచారం. అప్పుడే ఐపీఎల్ వేదికలు, మ్యాచుల వేదికల వివరాలకు కన్‌ఫర్మ్ అవుతాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్‌ వేదికల్లో ఈ సీజన్ నిర్వహించాలని బీసీసీఐ బోర్డులోని ఓ అధికారి చెప్పారు. అయితే, ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉందని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని లీగ్‌ తేదీలను ఖరారు చేస్తారని సమాచారం.

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ చివరి సీజన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా మ్యాచు‌లు నిర్వహించాయి. దుబాయ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్ శర్మ టీం.. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ కారణంగానే ఈసారి ఐపీఎల్‌ను ఇక్కడే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందట. అందుకే ఇక్కడే వేదికలను ఎంపిక చేసింది. ఇప్పుడా వేదికల్లో బయో-బబుల్స్‌ను ఏర్పాటు చేసే పనులు మొదలైపోయాయట. ప్రస్తుతం జరగుతున్న దేశవాళీ పోటీలు కూడా బయో సెక్యూర్ వాతావరణంలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM