Sports

IPL 2021 auction: ఐపీఎల్‌ 14 కొత్త ఆటగాళ్ల కోసం ఎంత ఖర్చు చేస్తున్నాయంటే..

ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రేక్షకులు లేకుండా యుఏఈలో జరిగిన విషయం తెలిసిందే. కరోనా భయంతో అసలు ఈ సీజన్‌ ఉంటుందా, ఉండదా అనుకునే పరిస్థితుల నుంచి ఎన్నో జాగ్రత్తల మధ్య ఐపీఎల్‌ 13 జరిగింది. ఇక ఐపీఎల్‌ 14 కోసం ఇప్పటి నుంచే ఆటగాళ్లను సెట్‌ చేసే పనిలో టీమ్స్‌ నిమగ్నమై ఉన్నాయి. అయితే ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం జరిగే మినీ ఆటగాళ్ల వేలం ఓ వారం పాటు వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 11న ఈ వేలం జరపాలని ఇంతకుముందు బీసీసీఐ నిర్ణయం తీసుకోగా.. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 లేదా 19న ఈ వేలాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఐపీఎల్‌ పాలక మండలి తుది షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

మరోవైపు ఆటగాళ్ల వేలం జరిగే వేదిక కూడా ఇంకా ఖరారు కాలేదని తెలుస్తుంది. ఈ వేలం ప్రక్రియకు ఈసారి చెన్నైని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే బీసీసీఐతో ఒప్పందం లేని ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలానికి అందుబాటులో ఉండాలనుకుంటే.. ఆటగాళ్ల వేలం కాంట్రాక్ట్‌ను ఫిబ్రవరి 4లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో ఐపీఎల్‌కు చెందిన 8 జట్లు తమ టీమ్‌ని పటిష్టం చేసుకునేందుకు ఈ వేలంలో రూ.196.6 కోట్లు ఖర్చు చేయబోతున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు రిటైన్‌ చేసుకునే ఆటగాళ్లు.. వేలం కోసం విడుదల చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి.

మొత్తంగా 8 ఫ్రాంచైజీలు 139 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. అలాగే అన్ని జట్లు తమ టీమ్‌ నుంచి దాదాపు 57 మంది ఆటగాళ్లను తొలగించినట్లుగా తెలుస్తోంది. అంటి పెట్టుకున్న ఆటగాళ్ల కోసం.. రూ.483.39 కోట్లు ఖర్చు చేయగా.. 8 ప్రాంచైజీలు కొత్త ఆటగాళ్ల కోసం రూ.196.6 కోట్లను వేలంలో ఖర్చు చేయబోతున్నాయి. ఇక పంజాబ్‌ జట్టు మ్యాక్స్‌వెల్‌, కాట్రెల్‌, నీషమ్‌, ముజీబుర్‌ వంటి 9 మంది ఆటగాళ్లకు ఉద్వాసన పలుకుతుండటంతో ఈసారి ఆ జట్లు ఎక్కువ మొత్తాన్ని వేలంలో ఖర్చు చేయబోతోంది.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM