ఎన్టీఆర్, త్రివిక్రమ్.. సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే? jr ntr trivikram srinivas
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా వస్తుంది అంటే చాలు అభిమానుల్లో ఎక్కడా లేని సంతోషం పుట్టుకొచ్చేస్తుంది. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాతో సూపర్ హిట్ని అందించిన దర్శకుడు, మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు వారి మొదటి పండగ అయిన ఉగాది రోజున ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ కి 30 వ సినిమా.
అరవింద సమేత తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో మొదలు పెట్టి, మే, జూన్ నెలల్లో సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి లోపే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసేసి, వెంటనే మరో చిత్రం షూటింగ్ కి వెళ్లాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని అక్టోబర్ 13 న దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. సంచలన దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ తారాగణంతో తెరకెక్కుతోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…