‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం ఎన్ని మలుపులు తిరిగిందో తెలియంది కాదు. ఎట్టకేలకు శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తన రెండో చిత్రాన్ని ప్రకటించారు. ‘మహాసముద్రం’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.
తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి వ్యక్తమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ అందరిలోనూ కుతూహలాన్ని కలిగిస్తోంది. శనివారం మహాసముద్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో సముద్రం ఒడ్డున ఉన్న ఓ బోట్‌పై ఒకరికొకరు వీపులు చూపిస్తూ కూర్చొని సిగరెట్ తాగుతున్న ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు.
నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తొలిసారిగా ఓ అపురూపమైన ప్రేమకథను తమ బ్యానర్‌పైన అందిస్తున్నామని చెప్పారు. ‘‘ఇన్నేళ్లుగా మీరెందుకు ఓ లవ్ స్టోరీని నిర్మించడం లేదని ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతూ వస్తున్నారు. ఇప్పుడు మేం ఎప్పటికీ గర్వపడే ఓ అపురూపమైన, అపారమైన లవ్ యాక్షనర్‌ను అందిస్తున్నాం. 19 ఆగస్ట్ 2021న తీ రాలను ఢీకొట్టడానికి ‘మహాసముద్రం’ వస్తోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
అరమరికలొద్దు. అపోహలొద్దు. అనుమానాలొద్దు. అసూయలొద్దు. అహంకారాలొద్దు. బ్రాహ్మణుడు క్షేమంకరమైన భావాలతో సంచరిస్తేనే అపూర్వాలు సమాజానికి అందుతాయంటూ చాలా చక్కగా ప్రముఖ…
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై…
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్…
క్రమపాఠీలు, ఘనపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు... ఇలా ఎందరో వేదనిధుల్లాంటి వందకు పైగా వివిధ ఆలయాల, వివిధ వేద పాఠశాలల వేదపండితులు…
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…