మాటిస్ స్టోర్ ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు | Matis Interior Showroom Launch by Finance Minister
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. ఇంటీరియర్ అందాన్ని రెట్టింపు చేసేందుకు హైదరాబాద్ నగరానికి ‘మాటిస్’ సంస్థ వచ్చేసింది. రోజురోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో ఈ సంస్థ తమ నగర వాసులకు అందుబాటులో ఉంది. ఈ సంస్థను తెలంగాణ మినిస్టర్ హరీష్ రావు ప్రారంభించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68లో నిర్మాణమైన ఈ సంస్థ నగర ప్రజలందరికీ కొత్త అనుభూతిని ఇచ్చేలా, కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావడం శుభపరిణామం అని హరీష్ రావు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ఇల్లు కొనే చాలా మంది ఇంటీరియర్ విషయంలోఎంతో ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇంటి అందాన్ని ఇది రెట్టింపు చేస్తుందని అన్నారు. ఇంటి కొనుగోలుదారులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు నలుగురిలో తమను ప్రత్యేకంగా నిలపడంలో మాటిస్ తన వంతు పాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన రెలవుడ్, డుపాంట్స్ కొరియన్ ఉత్పత్తులను మాటిస్‌లో ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తరుణ్ పటేల్, కిషన్, దీపక్, నందీప్ తెలిపారు. మంత్రి హరీష్ రావు సపోర్ట్ మరవలేనిదని, అడగగానే వచ్చి స్టోర్ ప్రారంభించిన ఆయనకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావుతో పాటు ప్రముఖ హీరో జయంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
మరి కొందరు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై.. హైదరాబాద్‌లో అందరికీ అందుబాటులో ఈ షోరూమ్ ఉండటం మంచి పరిణామమని, ఈ సంస్థ సక్సెస్ కావాలని కోరుకున్నారు. హాజరైన అతిథులందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…