ys sharmila clarity about new party rumors, కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల
జస్ట్ టీజర్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో మొదటి పేజీలోనే తాటికాయంత అక్షరాలతో సంచలన కథనం వచ్చిన విషయం తెలిసిందే. ‘జగన్ పైకి షర్మిల బాణం!’ అనే హెడ్డింగ్‌తో ఆ పత్రిక యజమాని వారంతంలో రాసే కొత్తపలుకులో రాసుకొచ్చారు. ఈ కథనంపై ఒక్క వైసీపీ నేతలు తప్ప ఇతర పార్టీ నేతలంతా ఆఖరికి సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కూడా స్పందించారు కానీ అసలైన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ వీరాభిమానులు, ద్వితియశ్రేణి నేతలు మాత్రం తీవ్రంగా ఖండించడమే కాకుండా.. ఆ కథనం రాసిన పెద్దాయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.
అంతేకాదు.. అదేమైనా నందమూరి ఫ్యామిలీ అనుకున్నావా..? లేకుంటే నారా ఫ్యామిలీ అనుకుంటున్నావా..? అంటూ విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదండోయ్.. ఆ దినపత్రిక యజమానిపై, కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగతంపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే కనీసం ఈ కథనంపై వైసీపీ నుంచి ఒక్క నేత కూడా స్పందించకపోవడం.. కనీసం తెలంగాణ వైఎస్ ఫ్యామిలీ అంటే మక్కువ ఉండే నేతలెవ్వరూ కూడా రియాక్ట్ కాకపోవడం గమనార్హం. దీంతో మౌనానికి అర్థం అంగీకారమే అన్న చందంగా అందరూ అదంతా నిజమే అనుకుంటున్నారు.
వాస్తవానికి వైసీపీ అంటే ఆ పత్రిక యజామానికి అస్సలు పడదన్నది జగమెరిగిన సత్యం. ఆయన ఎంతసేపు ఎవరికి సపోర్టు చేస్తారో అన్నది అందరికీ తెలుసు. వైసీపీని అధికారంలోకి రాకుండా ఉండటానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరూ ఊహించని విధంగా కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ గెలిచి జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పట్నుంచి ఆయన రాళ్లు వేస్తూనే ఉన్నారని.. తాజాగా రాసిన ఆయన కథనం కూడా అలాంటిదేనని కొందరు జగన్ ఫాలోవర్స్ చెప్పుకుంటున్నారు. అసలు ఇలాంటి కథనాలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని.. అధిష్టానం నుంచి కొందరు కీలక నేతలకు కూడా కబుర్లు కూడా వెళ్లాయట. ఈ మధ్యే రేటింగ్స్, టీఆర్పీ విషయంలో ఆ పత్రిక, ఛానెల్‌కు ఆశించినంతగా కాకుండా అట్టర్ ప్లాప్‌గా ఫలితం వచ్చిందని.. అందుకే ఇలా హడావుడి చేస్తూ టీఆర్పీ, పత్రికల సర్కులేషన్ పెంచుకోవాలని చూస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో ఏంటో..!
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…