Prabhas Launches Ichata Vahanamulu Niluparadu Teaser: ప్రభాస్ వదిలిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్
యంగ్ హీరో సుశాంత్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో చేసిన పాత్రతో ఇటు విమర్శకుల, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్. దర్శన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్‌లైన్. మీనాక్షి చౌదరి హీరోయిన్. శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.
1 నిమిషం 30 సెకన్ల నిడివి వున్న ఈ టీజర్ సినిమాని చూడాలనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కలిగిస్తోంది. అంత ఉత్కంఠభరితంగా టీజర్ ఉంది. టైటిల్‌లో సజెస్ట్ చేసినట్లు నో పార్కింగ్ ప్లేస్‌లో తన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను హీరో సుశాంత్ పార్క్ చేస్తే, కాలనీవాసులు దాన్ని ధ్వంసం చేసినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అక్కడ బైక్‌ను హీరో పార్క్ చేయడం వెనుక కూడా ఏదో కథ ఉందని అర్థమవుతోంది. నవ్వులు పండించే బాధ్యతను వెన్నెల కిశోర్ తీసుకున్నారని టీజర్ తెలియజేస్తోంది. అందమైన ప్రేమకథకు మిస్టరీ ఎలిమెంట్‌ను జోడించి డైరెక్టర్ దర్శన్ ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రాన్ని మలిచారు.
సుశాంత్, మీనాక్షి చౌధరి, వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణచైతన్య, హరీష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక బృందం:
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
సంభాషణలు: సురేష్ భాస్కర్
ఆర్ట్: వి.వి.
పీఆర్ఓ: వంశీ-శేఖర్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల
దర్శకత్వం: ఎస్. దర్శన్
బ్యానర్స్: ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్
హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…