Reviews

రివ్యూ: ‘సోదర సోదరీమణులారా’

మూవీ పేరు: సోదర సోదరీమణులారా

నటీనటులు: కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ తదితరులు

రచన, దర్శకత్వం: రఘుపతి రెడ్డి గుండా
నిర్మాత: విజయ్ కుమార్ పైండ్ల
సినిమాటోగ్రఫీ: మోహన్ చారి
నేపథ్య సంగీతం: వర్ధన్
ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి
పి ఆర్ ఓ: బి ఏ రాజు ‘s టీం
పబ్లిసిటీ డిజైనర్: వివ రెడ్డి

9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్స్ పై కమల్ కామరాజు, అపర్ణాదేవి నటీ నటులుగా నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో విజయ్ కుమార్ పైండ్ల నిర్మించిన ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా ‘సోదర సోదరీమణులారా…’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్లలో సెప్టెంబర్ 15న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సోదర సోదరీమణులారా”.. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ

రాజు (కమల్ కామరాజు), క్యాబ్ డ్రైవర్ గా తన పని తాను చేసుకుంటూ భార్య శ్రావణి (అపర్ణాదేవి), కూతురు మహాలతో హ్యాపీ గా గడుపుతుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో లేట్ నైట్ లో సన్నీ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్ రాజు ను కిరాయికి రావాలని అడగడంతో ఉరి చివరన ఉన్న రిసార్ట్ కు బయలు దేరుతారు.అక్కడ జరిగిన కొన్ని పరిణామాలలో భాగంగా ఒక అమ్మాయిని తన క్యాబ్ లో ఎక్కించుకుని తిరుగు ప్రయాణం అవుతాడు. దారిలో పోలీసులు చెక్ చేయగా క్యాబ్ లో ఉన్న అమ్మాయి మరణించి ఉంటుంది. దీంతో రాజు పై రేప్ & మర్డర్ కేస్ బనాయించ బడుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? రాజుకు, ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి? పోలీసులు చెప్పిన ప్రకారంగా రాజే ఆ ఆమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడా? లేక ఎవరైనా రాజును ఈ కేసులో ఇరికించారా? రాజు భార్య శ్రావణి తన భర్త నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఎలాంటి పోరాటం చేసింది? అనేది తెలుసుకోవాలంటే ‘సోదర సోదరీమణులారా…’ సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
క్యాబ్ డ్రైవర్ రాజు పాత్రలో కమల్ కామరాజు అమాయకుడుగా క్యారెక్టర్ కు తగ్గట్టు చక్కగా సూటయ్యడు. అలాగే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజు భార్య గా నటించిన శ్రావణి (అపర్ణాదేవి) ఇన్నోసెంట్ భార్యగా చక్కటి పెర్ఫార్మన్స్ చేసింది. తెరపై వీరిద్దరి జోడీ చాలా క్యూట్ గా ఉంది. హోం మినిస్టర్ గా సీనియర్ నటుడు పృద్వి నెగటివ్‌ షేడ్‌ లో ఆకట్టుకున్నాడు. తన పాత్రతో సినిమాకు ప్రాణం పోశాడు. సి. ఐ భాస్కర్ పాత్రలో బాహుబలి ప్రభాకర్ చక్కటి ప్రదర్శన చూపించాడు. తనపై అధికారిగా యస్. పి పాత్రలో వెంకటేశ్వర్ రావు చాలా బాగా నటించాడు.ఇంకా ఈ చిత్రంలో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు..

సాంకేతిక నిపుణుల పనితీరు

ఒక రిసార్ట్ కు డ్రాప్ చేయడానికి వెళ్లిన రాజు లైఫ్ ఎలా టర్న్ అయింది అనేటటువంటి ఓ రెగ్యూలర్‌ స్టోరీని తీసుకుని ఇంట్రెస్టింగ్ కలిగించే ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా కథను ఎంచుకుని ఒక్క పాట కూడా లేకుండా ఆసక్తికరమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతూ ఆర్టిస్టులు రియాలిస్టిక్ పెర్ఫార్మన్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా చక్కగా తెరకెక్కించిన దర్శకుడు డైరెక్టర్ రఘుపతి రెడ్డి గుండా ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కథ కాస్త ఇంట్రెస్ట్ గా మారుతుంది. మోహన్ చారి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ ఫుల్‌గా ఉన్నాయి. వర్ధన్ అందించిన నేపద్య సంగీతం ఈ సినిమాకు మైనస్ గా మారింది. పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటింగ్ తన కత్తెరకు ఇంకొంచెం పని చెప్తే బాగుండేది.EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్స్ పై విజయ్ కుమార్ పైండ్ల నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా తెరకెక్కిన ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం సోదర సోదరీమణులారా.. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో బయటకు వస్తాడని చెప్పవచ్చు.

‘జస్ట్ టీజర్’ రేటింగ్: 3/5

Share
Published by
Just Teaser

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM