Sevenhills Satish 3rd film first look soon
గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి కథానాయికలుగా సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా ఓ చిత్రం రూపొందుతుంది. పి.నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికి మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గతంలో ‘బట్టల రామస్వామి బయోపిక్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి ఆర్.పి.పట్నాయక్‌తో ఓ చిత్రం చేశారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న మూడో చిత్రమిది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మఽధ్య తరగతి కుర్రాడి కథ ఇది. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం అలరిస్తుంది. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తాం.
హీరో గౌతం కృష్ణ ‘ఆకాశవీధుల్లో’ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. తదుపరి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో స్టూడెంట్ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు’’ అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘‘విజయవంతంగా మూడు షెడ్యూళ్లు పూర్తి చేశాం. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.
నటీనటులు:
పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్ చక్రపాణి, భద్రం, పింగ్ పాంగ్ సూర్య తదితరులు.
ప్రొడ్యూసర్ : సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
దర్శకత్వం : పి నవీన్ కుమార్
కెమెరా: : త్రీలోక్ సిద్దూ
మ్యూజిక్ : జుడా శాండీ
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
పీఆర్వో : మధు విఆర్
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…