‘షణ్ముఖ’ టైటిల్ లోగో విడుదల Shanmukha Title Logo Released
శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రం నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో షణ్ముగం సాప్పని దర్శకత్వంలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా, అవికాగోర్ హీరోయిన్‌గా జంటగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ఉగాది పర్వదినాన హైదరాబాద్ ఆవిష్కరించారు. షణ్ముఖ అనే చిత్ర టైటిల్ లోగోను సాప్పని బ్రదర్స్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ… షణ్ముఖ అనే టైటిల్ వినగానే నాకు బాగా నచ్చింది. టైటిల్‌లో చాలా పాజిటివ్ వైబ్ వుంది. మా కథ నచ్చి ఎంతో బిజీగా వున్న కూడా రవిబసూర్ మా చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా వుంది. సినిమా కూడా చాలా రిచ్‌గా వుంటుంది. యూనిక్‌గా వుండే డిఫరెంట్ కథ ఇది. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి చేసిన ఈ చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు.
దర్శకుడు షణ్ముఖం మాట్లాడుతూ… శాసనసభ తరువాత నేను సినిమాకు దూరం అవుతానని అందరూ అనుకున్నారు. కానీ నాకు సినిమా అంటే పాషన్. రవిబసూర్ సహకారంతో ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తయింది. కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. తప్పకుండా మా కొత్త ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను అన్నారు. నిర్మాతల్లో ఒకరైన తులసీ రామ్ సాప్పని మాట్లాడుతూ మా తమ్ముడికి సినిమా అంటే పాషన్. అందుకే ఎంతో కష్టపడి ఈసినిమా చేశాడు. తప్పకుండా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. చిత్ర నిర్మాత, ఎమ్ఎల్‌సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ షణ్మగంకు సినిమా మీద వుండే ఆసక్తితో, నేను రాజకీయాల్లో వున్న ఈ సినిమా నిర్మించాను. ఒక మంచి కథతో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. అద్బుతమైన విజువల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసూర్ సంగీతం హైలైట్‌గా వుంటుందని, ఈ చిత్రంలో ఆది చాలా కొత్తగా వుంటాడని, షాకింగ్‌గా వుంటే విజువల్స్ ఈ చిత్రంలో వుంటాయని మనోజ్ నందం తెలిపారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…