Health

basil plant benefits: తులసి మొక్క ఇంటిలో ఉంటే.. ఇక మీరే డాక్టర్లు

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇప్పుడున్న బిజీ బిజీ జీవితంలో సగటు మనిషి తన ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడమే మానేశాడు. కానీ గత కొన్ని నెలలుగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకు కారణం ఓ మహమ్మారి విలయ తాండవం. ఆ మహమ్మారి వలన ప్రతి ఒక్కరు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ తమ ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తతో ఉంటున్నారు. మన ఇంట్లో, పెరట్లో ఉండే ప్రతి చెట్టు, వస్తువు మనకి ఎంతో మేలు చేస్తాయో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇలా ఇంటిలో ఉండి మేలు చేసే వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తులసి మొక్క గురించే.

ఈ తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఉంటుంది. పూజ కోసం మాత్రమే ఈ మొక్క ఉపయోగపడుతుంది అనుకుంటారు చాలామంది. కానీ ఈ మొక్క వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • కాలం మారిన ప్రతి సారి జలుబు, దగ్గు లాంటివి సర్వసాధారణం. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. కొన్ని తులసి ఆకుల రసం తీసుకొని, అందులో ఒక స్పూన్ తేనెను కలిపి రోజు తీసుకుంటున్నట్లైతే జలుబు, దగ్గు నాలుగు రోజుల్లో తగ్గడమే కాకుండా… డాక్టర్‌తో అవసరమే ఉండదు. ఈ చిట్కాని సంవత్సరం పిల్లల నుంచి ఎవరైనా తీసుకోవచ్చు.
  • కడుపు నొప్పికి కూడా ఈ తులసి ఆకులని వాడవచ్చు. ఒక స్పూన్ తులసి ఆకుల రసం, అల్లం రసం ఒక స్పూన్ కలిపి వేడి చేసి… అందులో తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకున్నట్లైతే కడుపు నొప్పి తగ్గు ముఖం పడుతుంది.
  • తులసి రసం 4 లేదా 5 చుక్కలు, హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లిరసంలో కలిసి రోజూ చెవిలో వేస్తూ.. చెవి నొప్పికి ఉపశమనం లభిస్తుంది.
  • అల్లం ముక్కకు కొన్ని తులసి ఆకులు జోడించి ముద్దగా చేసుకుని, అందులో ఒక టీ స్ఫూను తేనె కలిపి తినాలి, తరువాత శొంఠి, తులసి కలిపి ముద్దగా నూరి నుదిటికి పట్టిలాగా వేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే జ్వరం త్వరగా జారుతుంది.
    ఇంకా ఎన్నో ప్రయోజనాలు, ఔషధ గుణాలున్న ఈ తులసి మొక్కని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పెంచుకుంటే.. దాదాపు సగం జబ్బులను ఇంట్లో నుంచే నయం చేసుకోవచ్చు.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM