Featured

బక్క భవనం.. రేటు ఎంతో తెలుస్తే దిమ్మతిరిగిపోద్ది!

Thinnest building: ఇళ్లు కట్టుకోవాలని ఆలోచన వస్తే చాలు.. ‘లంకంత కొంప’ కట్టుకోవాలని పాతరోజుల్లో పెద్దవాళ్లు తమ సంతానానికి చెప్పేవారు. కానీ ప్రస్తుత మోడ్రన్ యుగంలో ఇలా లంకంత కొంపలు కనిపించడం చాలా అరుదు. మరీ ముఖ్యంగా సిటీల్లో అయితే.. ఎటు చూసినా అన్నీ అపార్టుమెంటులే దర్శనం ఇస్తాయి. ఖాళీ స్థలం కనిపించిందంటే చాలు.. అక్కడే ఓ పది అంతస్థులు లేపేయాలని బిల్డర్లు ప్లాన్లు వేసేస్తారు. ఇప్పుడు ఈ సిటీ మోడల్‌ను కూడా మించి పోయిన ఓ ఇంటి గురించి మాట్లాడుకుందామా?

రెండు భవనాల మధ్య ఇరుక్కుపోయినట్లు ఉండే ఈ ఇల్లు మామూలుగా మనకు కనిపించడం కూడా కష్టమే. ఆ దారిన వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తగా గమనిస్తేగానీ అక్కడ ఆ భవంతి ఉన్నట్లు కూడా కనిపించదు. ఈ వింత భవనం ఉంది బ్రిటన్ రాజధాని లండన్‌లో. ఇలా మరీ సన్నగా ఉన్న ఈ భవనం ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది!

ఇంత బక్కగా ఉన్న ఈ భవనాన్ని ఎవరు కొంటారు? అని అనుమానం రావడం సహజమే కానీ, ప్రపంచం మాత్రం దీనిపై చాలా ఆసక్తి చూపిస్తోంది. లండన్‌లో అత్యంత సన్నగా ఉండే ఈ బంగళా మార్కెట్ ధర తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఇది మార్కెట్లో దాదాపు రూ. 11 కోట్ల రేటు పలుకుతోంది.

19వ శతాబ్దం చివర్లో ఈ బంగళాను నిర్మించడం జరిగిందట. పొడవు సాధారణంగానే ఉన్న దీని వెడల్పు మాత్రం కేవలం 5 అడుగుల ఏడు అంగుళాలే. ఈ భవనం కట్టిన కొత్తలో ఇందులో టోపీలు అమ్మే ఓ దుకాణం ఉండేది. ఇందులో ఓ కుటుంబం ఉండటానికి, ముడిసరుకు నిల్వ చేసుకోవడానికి కొంత స్థలం కూడా కేటాయించారు.

ఇదిగో ఇన్నాళ్లకు బ్రిటన్‌కు చెందిన రియల ఎస్టేట్ సంస్థ ‘వింక్ వర్త్ ఎస్టేట్’ ఈ బక్క భవనాన్ని అమ్మకానికి పెట్టింది. ఈ క్రమంలోనే దీని ధరను 1.3 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లెక్కల్లో దాదాపు 11 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఇంత బక్క బంగళాకు అంత భారీ రేటు ఏంటని ప్రశ్నిస్తే మాత్రం.. ఈ బంగళా ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని తాము ఈ ధర నిర్ణయించామని, ఇది కచ్చితంగా సబబైన ధరేనని వింక్‌వర్త్ కంపెనీ బల్లగుద్ది మరీ వాదిస్తోంది.

లండన్ చరిత్రలో ఈ భవనానికి ప్రత్యేక స్థానం ఉందని ఆ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ అంటున్నారు. చూడటానికి బక్కగా ఉన్న ఈ భవంతి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వంటిల్లు.. మొదటి అంతస్తులో బెడ్ రూం, స్టడీ రూం.. రెండో ఫ్లోర్‌లో బాత్రూమ్, షవర్ రూం.. మూడో అంతస్తులో మాస్టర్ బెండ్ రూం ఉన్నాయి.

Share
Published by
Just Teaser

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM