జాగ్రత్త.. ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ వస్తోంది | Uppena movie Release date Fixed
మెగా ఫ్యామిలీ నుంచి సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీకి విడుదల తేది ఖరారైంది. ఫిబ్రవరి 12న ఈ చిత్రాన్ని థియేటర్‌లలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే సంగీతంలో తన అభిరుచికి, పాటలను ప్రెజెంట్ చేసిన విధానంతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా, ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వారి స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఈ టీజర్‌తో ‘ఉప్పెన’పై అంచనాలు భారీగా పెరిగాయి. దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చగా ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్న చిత్రంలో సాయిచంద్, బ్రహ్మాజీ వంటి వారు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సీఈవో: చెర్రీ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…