Adivi Sesh Major Release date locked, అడవి శేష్ మేజర్ రిలీజ్ డేట్
‘మేజర్’ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గెటప్‌లో ఉన్న అడివి శేష్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ‘మేజర్’ చిత్రీకరణ అతి త్వరలో పూర్తికానుంది. ఈ చిత్రాన్ని జూలై 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో అడివి శేష్ తుపాకీ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను భారీగా పెంచుతూ వచ్చింది.
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది. అతను చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెలబ్రేట్ చేయడమే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…