Cinema

Ichata Vahanamulu Niluparadu: ప్ర‌భాస్ వదిలిన ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ టీజ‌ర్‌

యంగ్ హీరో సుశాంత్ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంలో చేసిన పాత్ర‌తో ఇటు విమ‌ర్శ‌కుల‌, అటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌. ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్‌లైన్‌. మీనాక్షి చౌదరి హీరోయిన్‌. శుక్ర‌వారం ఈ మూవీ టీజ‌ర్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు.

1 నిమిషం 30 సెక‌న్ల నిడివి వున్న ఈ టీజ‌ర్ సినిమాని చూడాల‌నే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో క‌లిగిస్తోంది. అంత ఉత్కంఠ‌భ‌రితంగా టీజ‌ర్ ఉంది. టైటిల్‌లో స‌జెస్ట్ చేసిన‌ట్లు నో పార్కింగ్ ప్లేస్‌లో త‌న కొత్త రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను హీరో సుశాంత్‌ పార్క్ చేస్తే, కాల‌నీవాసులు దాన్ని ధ్వంసం చేసిన‌ట్లు టీజ‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది. అక్క‌డ బైక్‌ను హీరో పార్క్ చేయ‌డం వెనుక కూడా ఏదో క‌థ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. న‌వ్వులు పండించే బాధ్య‌త‌ను వెన్నెల కిశోర్ తీసుకున్నార‌ని టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. అంద‌మైన ప్రేమ‌క‌థ‌కు మిస్ట‌రీ ఎలిమెంట్‌ను జోడించి డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్ ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు చిత్రాన్ని మ‌లిచారు.

సుశాంత్‌, మీనాక్షి చౌధ‌రి, వెంక‌ట్‌, వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వ‌ర్య‌, నిఖిల్ కైలాస‌, కృష్ణ‌చైత‌న్య‌, హ‌రీష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక బృందం:
సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
సినిమాటోగ్ర‌ఫీ: ఎం. సుకుమార్‌
ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌
సంభాష‌ణ‌లు: సురేష్ భాస్క‌ర్‌
ఆర్ట్‌: వి.వి.
పీఆర్ఓ: వ‌ంశీ-శేఖ‌ర్‌
నిర్మాత‌లు: ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల
ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌. ద‌ర్శ‌న్‌
బ్యాన‌ర్స్‌: ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్‌

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM