ఆటోలో బతికేస్తున్న 74 ఏళ్ల వృద్ధుడు.. ఆరా తీస్తే కన్నీరు పెట్టించే కథ..
ఇళ్లలో ముసలి వాళ్లకు మనుమలంటే చాలా ప్రేమ ఉంటుంది. మనవళ్లు, మనుమరాళ్ల కోసం ఎంత పెద్ద త్యాగం చేయడానికైనా వాళ్లు వెనుకాడరు. సరిగ్గా ఇలాంటిదే తన మనుమరాలి కలలను నిజం చేయడం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన ఓ తాతయ్య కథ తాజాగా వెలుగు చూసింది. ఈ కథ తెలిసిన అనేక మంది మనసులు చలించాయి. మానవత్వం పెళ్లుబికింది. దీంతో వాళ్లంతా ఆ తాతయ్యకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. బిజీ బిజీ జీవితాల్లో ఇంట్లో వాళ్లనే పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండటం లేదనే మాటలను తప్పు అని నిరూపిస్తూ.. కాంక్రీట్ జంగిల్స్‌లా మారిన సిటీల్లో కూడా స్పందించే హృదయం గల దాతలు ఉన్నారని నిరూపించారు. వీరికి వారధిగా ‘హ్యూమన్స్ ఆఫ్ బోంబే’ నిలిచింది.
‘హ్యూమన్స్ ఆఫ్ బోంబే’ ఫేస్‌బుక్ పేజ్‌లో దేశ్‌రాజ్ (74) అనే ఓ తాతయ్య కథను ప్రచురించారు. తన మనుమరాలి కలను సాకారం చేయడం కోసం ఆయన చేసిన త్యాగం ఏంటో చక్కగా వివరించారు. దీంతో అనేక మంది మానవత్వంతో స్పందించి, విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో మొత్తం మీద ఆయనకు రూ.24 లక్షల వరకు విరాళాలు లభించాయి.
దేశ్‌రాజ్ ఓ ఆటో డ్రైవర్. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ మరణించారు. దీంతో తన భార్య, కోడలు, మనుమలను ఆయనొక్కరే పోషిస్తున్నారు. ఆయన మనుమరాలికి కాలేజి చదువులు చదవాలనే బలమైన కోరిక ఉంది. తమ కుటుంబంలో కనీసం ఒకరైనా గ్రాడ్యుయేట్ అవ్వాలని, టీచర్ అవ్వాలని దేశ్‌రాజ్ కూడా కోరుకున్నారు. కానీ ఆయన స్థోమత దానికి సరిపోలేదు.
గత ఏడాది 12వ తరగతి పరీక్షల్లో దేశ్‌రాజ్ మనుమరాలికి 80 శాతం మార్కులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన ఆయన సంతోషానికి హద్దులు లేవు. ఆమెను పెద్ద చదువులు చదివించాలని గట్టిగా నిర్ణయించుకుని, ఇంటిని అమ్మేశారు. ఉండటానికి చోటు లేకపోవడంతో తన భార్య, కోడలు, మనుమలను స్వగ్రామంలోని బంధువుల ఇంటికి పంపించారు. తను మాత్రం ముంబైలో ఆటోలోనే కాలం గడుపుతున్నారు.
దేశ్‌రాజ్ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సుమారు రెండు లక్షల లైక్స్, వేలాది షేర్లు వచ్చాయి. దీన్ని చదివిన దాతలు విరాళాల రూపంలో రూ.24 లక్షలు ఇచ్చారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. దీంతోనైనా ఆయన కష్టాలు తీరతాయని కోరుకుందాం.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…