Categories: CinemaLatestTopStory

‘క్షణక్షణం’ చిత్రానికి బంపర్‌ ఆఫర్

ఒక చిన్న చిత్రానికి పెద్ద బ్యానర్‌ అండ దొరికితే.. బంపర్‌ ఆఫర్‌ లభించినట్లే. ఇప్పుడు ‘క్షణక్షణం’ చిత్రానికి అటువంటి బంపర్‌ ఆఫరే లభించింది. మన మూవీస్ బ్యానర్‌లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘క్షణక్షణం’. డార్క్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. క్షణక్షణం సినిమా ఈ నెల 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ”రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని లెక్కలు వేసుకుని చేస్తాం. కానీ ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ఇటీవల చావు కబురు చల్లగా సినిమా చేస్తున్నప్పుడు నేను అది ఎక్సీపిరియన్స్ చేశాను. క్షణక్షణంతో అలాంటి ధైర్యం చేసిన వర్లగారిని, మౌళిగారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. సినిమా నచ్చడంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి డిఫరెంట్ ఫిలింస్ వస్తే ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ పరిచయం అవుతుంది. కొత్త నటీనటులు, దర్శకులు ఇండస్ట్రీకి వస్తారు. క్షణక్షణం సినిమాను చూడమని చాలా మందికి రిఫర్ చేశాను. ఉదయ్ శంకర్‌ను ఆయన మొదటి సినిమా ఆటగదరా శివ నుంచి చూస్తున్నాను. విభిన్నమైన కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు. ఇష్టంతో కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి వస్తారు. నాకు సినిమా అంటే ప్యాషన్. నాకే బ్యాక్ గ్రౌండ్ లేదు. సినిమాను ప్రేమించాను కాబట్టి ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. వారసులకైనా మొదటి ఆట వరకే అడ్వాంటేజ్ ఆ తర్వాత వాళ్లు ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఉదయ్ శంకర్ క్షణక్షణంతో ప్రేక్షకులను మెప్పిస్తాడని అనుకుంటున్నాను..” అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ”మమ్మల్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న బన్నీ వాసుగారికి చాలా థ్యాంక్స్. సినిమా నచ్చి ఆయన తనే డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకొచ్చారు. గీతా ఫిలింస్ లో మా సినిమా రిలీజ్ కావడం గౌరవంగా భావిస్తున్నా. బన్నీ వాసుగారు మాకు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇష్టపడి కష్టపడి సినిమా చేశాం. నాకింత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు కార్తీక్‌కు థ్యాంక్స్. సంగీత దర్శకుడు కోటిగారు ఓ మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది..” అన్నారు.

దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ.. ”బన్నీ వాసుగారి సపోర్ట్ మర్చిపోలేం. తమన్నా గారికి కూడా థ్యాంక్స్, ఆమె ట్విట్టర్ ద్వారా మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. చిన్న సినిమాను ప్రేక్షకులు చూడాలంటే కొత్తగా ఏదైనా ఉండాలి. క్షణక్షణంలో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్లు ఆకట్టుకుంటాయి. ట్రైలర్ లో కొన్ని విషయాలు మేం చెప్పలేదు. అలా దాచిన వాటిలో రఘు కుంచెగారి క్యారెక్టర్ ఒకటి. ఆయన రోల్ షాకింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు కూడా క్షణక్షణం ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నా. డెఫనెట్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారు..” అని తెలిపారు.

సంగీత దర్శకుడు రోషన్ సాలూరి మాట్లాడుతూ.. ”క్షణక్షణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేప్పుడు చాలా సార్లు బన్నీ వాసుగారు మా స్టూడియోకు వచ్చారు. చాలా కేర్ తీసుకున్నారు. దర్శకుడు కార్తీక్ టాలెంటెడ్, మ్యూజిక్‌కు స్వేచ్ఛ నిచ్చి చేయించారు. ఎలా చేస్తున్నారు, ఏంటి అని ఒక్క రోజుకూడా అడగలేదు. నా మీద అంత నమ్మకం ఉంచి మ్యూజిక్ చేయించారు. థ్యాంక్స్‌..” అని చెప్పారు.

నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ.. వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. ఆయన సంపాదన అంతా సినిమా మేకింగ్ మీద పెట్టేవాడు. అంత ప్యాషన్ సినిమాలు అంటే. నేను అదే ప్యాషన్ ను ఉదయ్‌లో చూశాను. వాళ్ల నాన్న నాకు ఫ్రెండ్. మెడిసిన్ చదవమంటే సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. తను కోరుకున్న రంగంలో ముందుకు వెళ్లమని ఉదయ్‌కు చెబుతున్నా. తాడో పేడో ఇక్కడే తేల్చుకో. దర్శకుడు కార్తీక్ తనకు తెలియకుండానే ఒక సూపర్ హిట్ సినిమా ఫార్ములాను క్షణక్షణం కథలో వాడాడు. కొత్తగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది.. అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ.. క్షణక్షణం అనే టైటిల్ పెట్టినప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. అది వెంకటేష్ గారి సినిమా. మేము మంచి లాక్ డౌన్‌లో షూటింగ్ చేశాం. మా నిర్మాత డాక్టర్ గారు కాబట్టి ధైర్యంగా సెట్స్ కు వెళ్లే వాళ్లం. ఆయన మాకు మందులు ఇచ్చేవారు. కొత్త సినిమాలో ఏముంటుంది అనే ఆడియెన్స్ అనుకుంటారు. దాంతో కొత్త దర్శకులు, నటులు తమ సినిమాల్లో కథలు కొత్త కాన్సెప్ట్ లతో చేస్తున్నారు. నేను ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను.. అన్నారు.

నాయిక జియా శర్మ మాట్లాడుతూ… నాకు కథ చెప్పినప్పుడు ఒక ఫీల్ కలిగింది. కథలోని మలుపులు బాగా నచ్చాయి. అందుకే వెంటనే సినిమా ఒప్పుకున్నాను. కథను సినిమాగా చెప్పడం అంటే ఒక ఆర్ట్. అది మా దర్శకుడు కార్తీక్‌లో చాలా ఉంది. రేపు సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఒక మంచి అనుభూతికి లోనవుతారు.. అన్నారు.

ఉదయ్ శంకర్, జియాశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శ్రుతిసింగ్, మ్యూజిక్ దర్శకుడు కోటి, రఘుకుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్యపాత్రలను పోషించారు.

టెక్నీషియన్స్ :
డిఓపి: కె. సిద్దార్ద్ రెడ్డి,
మ్యూజిక్: రోషన్ సాలూర్,
ఎడిటర్: గోవింద్ దిట్టకవి,
పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా,
నిర్మాతలు: డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి,
దర్శకుడు: మేడికొండ కార్తిక్

Recent Posts

ఇంద్రకీలాద్రిపై ‘దేవీం స్మరామి’.. భాగ్యనగరంలో ‘దుర్గే ప్రసీద’తో ఆకట్టుకున్న పురాణపండ

తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…

October 11, 2024 at 1:09 PM

దేవీచౌక్ అమ్మవారి ఉత్సవాల్లో మెరిసిన పురాణపండ ‘సౌభాగ్య’

కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…

October 6, 2024 at 8:21 PM

‘మార్టిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ముఖ్యాంశాలు

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌,…

October 5, 2024 at 12:58 PM

రికార్డులు బద్ధలు కొడుతున్న ‘డీమాంటే కాలనీ 2’

నేషనల్‌, అక్టోబర్‌xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్ తో…

October 5, 2024 at 12:29 PM

గోపీచంద్ ‘విశ్వం’ థర్డ్ సింగిల్ వస్తాను వస్తానులే సాంగ్ రిలీజ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…

October 5, 2024 at 12:19 PM

ఆలియాభట్‌ “ఆల్ఫా” వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల!

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…

October 5, 2024 at 12:11 PM