Wednesday, December 25, 2024

#Surya45: హీరోయిన్ ఎవరంటే?

హీరో సూర్య నటిస్తున్న #Surya45 ఈమధ్యే గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ కళాఖండానికి అర్‌జె బాలాజీ దర్శకత్వం వహిస్తున్నటుగా తెలుస్తోంది. ఖైది, సుల్తాన్, ఒకే ఒక జీవితం వంటి ఎన్నెన్నో చిత్రాలను రూపొందించిన ప్రాముఖ్యమైన నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ పై ఎస్‌అర్ అయిన ప్రకాష్ బాబు, ఎస్‌అర్ అయిన ప్రభు, ఈ చిత్రాన్ని కూడా ప్రొడక్షన్ హౌస్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మూవీగా నిర్మించారు.

అయితే ఈమధ్యనే మేకర్స్ ఈ సినిమాకి హీరోయిన్‌గా సౌత్ ఇండియన్ క్వీన్ అయిన త్రిష నటిస్తుందని అనౌన్స్ చేసారు. ఈ ప్రాజెక్ట్‌లోకి ‘వెల్‌కం ఆన్ బోర్డ్ త్రిష’ అని చెబుతూ తయారుచేసిన పోస్టర్‌లో హీరోయిన్ త్రిష చరిస్మాటిక్ ప్రెజెన్స్‌తో మనందరినీ కట్టిపారేసింది.

ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలని త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x