Friday, May 3, 2024

‘వాము’ గురించి తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు

Ajwain: ఈ రోజు మనం అతి ముఖ్యమైన మరియు పిల్లల పాలిట సంజీవని గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే వాము. దీనిని ఓమా అని కూడా పిలుస్తుంటారు. ప్రతి ఒక్కరూ దీని వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా తల్లులు ఈ వాము వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుంటే తమ పిల్లల ఆరోగ్యం గురించి అస్సలు బెంగ పడాల్సిన అవసరమే ఉండదు. ఈ కాలంలో అసలు ఈ వాము గురించి తెలియని వారున్నారంటే అతిశయోక్తి కాదు. మన అమ్మమ్మల కాలంలో ఈ వాముని విరివిగా వాడుతుండే వారు. పిల్లల్లో తరచు కడుపునొప్పి, అజీర్తి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలు రావడం సహజం. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మొదటిగా ఈ వాముని ఉపయోగిస్తే చాలు. ఈ వాముని కేవలం కొన్ని రకాల వంటల్లో మాత్రమే వాడుతుంటారు. ఇందులో ఉన్న అద్భుత గుణాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు అవేంటో చూద్దాం.

– పసి పిల్లల్లో అజీర్తి వ్యాధి ఎక్కువగా ఉంటుంది. దానికోసం కెమికల్స్ కలిసిన మందులు వాడడం వలన ఇంకా ఇబ్బందులు ఎదురు కావచ్చు. అలా కాకుండా ఇంట్లోనే వాముతో ఔషధాన్ని తయారు చేసి ఉగ్గు లాగా (ఉగ్గు గిన్నెలో వేసి) పట్టిస్తే ఆ సమస్య ఇట్టే మాయమైపోతుంది. వాముని మెత్తగా నూరి నీటితో కానీ, లేదా తల్లి పాలతో కానీ కలిపి పట్టిస్తే వెంటనే ఆ సమస్య క్షణాల్లో దూరమవుతుంది.
– ఒక స్పూన్ వాము, మిరియాలని కలిపి ఒక పాత్రలో వేసి వేడి చేస్తూ మాడ్చాలి. ఇలా చేసిన తరువాత అందులో నీళ్లు పోసి బాగా మరిగించి, వడగట్టి వాటిని తీసుకుంటే కలరా వ్యాధి వలన అయ్యే విరేచనాలు తగ్గుతాయి.
– వాము, మిరియాలు, లవంగాలు, పసుపు, కరక్కాయ పెచ్చులు సమంగా కలిపి పెనం మీద వేడి చేస్తూ మాడ్చాలి… తరువాత తేనెను కలిపి నూరి, కంది గింజ పరిమాణంలో చుట్టి, ఆరబెట్టి నీళ్లలో కలిపి పిల్లలతో తాగించినట్లైతే పిల్లల్లో వచ్చే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అన్ని రకాల విరేచనాలు తగ్గుతాయి.
– వాము, త్రిఫల చూర్ణం, సైన్ధవ లవణం (రాక్ సాల్ట్) కలిపి రోజు పళ్ళ పొడి లాగా వాడినట్లైతే దంత సమస్యలు తగ్గుతాయి.
– వాముని నీళ్లు చల్లుతూ నూరి రసం తీసి, దానికి పంచదార, బెల్లం లేదా పటిక బెల్లం కలిపి తాగినట్లైతే ఛాతిలో పట్టేసినట్లుండే సమస్య తగ్గుతుంది.
– వాము, సైన్ధవ లవణం, నిమ్మరసం కలిపి బాగా ఎండబెట్టి రోజు ఉదయాన్నే తిన్నట్లైతే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
– వాము, శొంఠి, మిరియాలు, సైన్ధవ లవణం అన్ని కలిపి మజ్జిగతో కానీ, గోరువెచ్చని నీటితో కానీ తీసుకున్నట్లయితే పుల్లటి తేన్పులు తగ్గుతాయి.
– వాము, బెల్లం సమానంగా తీసుకుని నూరి చిన్న ఉసిరికాయ పరిమాణంలో చుట్టి రోజుకి మూడుసార్లు తీసుకున్నట్లైతే శరీరంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి. ఇంగ్లీష్ మందులకు ఇక గుడ్ బై చెప్పొచ్చు.
– వాముని పొడిచేసి దానికి కోడి గుడ్డు పచ్చసొన, తేనె, నిమ్మరసం కలిపి పేస్టులా చేసి తేలు కుట్టిన చోట పై పూతగా పూయాలి. ఇలా చేయడం వలన తేలు విషాన్ని లాగేస్తుంది. (ఇది కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే.)
– నువ్వుల నూనెకి వాముని కలిపి రోజు ఒక స్పూన్ చొప్పున తీసుకున్నట్లయితే అరి కాళ్ళు, చేతుల్లో పట్టే చెమట తగ్గుతుంది.

మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న వాము గురించి తెలుసుకోకపోతే ఎలా? అందుకే ఒక్కసారి వాము గురించి సెర్చించండి. దాని వల్ల కలిగే ప్రయోజనాలు పొందండి. మరో అప్‌డేట్‌లో వాము గురించి మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x