Saturday, November 30, 2024

ఆరోగ్యంతో పాటు సంపదను పెంచాలన్నదే మా సంకల్పం: ఉపాసన

తృణధాన్యాల గురించిన ఈ కథ మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. మాటల కన్నా చేతలు శక్తిమంతమైనవి. ప్రాకృతిక జీవన విధానం ఇంకా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రజలలో అవగాహన పెంచడంలో ఎప్పుడూ ముందంజలో ఉన్న సంస్థ – అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ కృషిలో భాగంగా ఇప్పుడు డెక్కన్ అభివృద్ధి సంఘం (డి.డి.ఎస్) ఆధ్వర్యంలో అయిదు వేల మంది మహిళా వ్యవసాయదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నది అపోలో హాస్పిటల్స్ లక్ష్యం. తృణ ధాన్యాల వినియోగాన్ని గురించి ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు వాటి వినిమయాన్ని పెంచడం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. అపోలో హెల్త్ కేర్ గ్రూప్ ఇప్పటికే 4000 కిలోల తృణ ధాన్యాలను సేకరించింది. అలాగే, ఇక నుండి ప్రతి నెలా 1000 కిలోల తృణధాన్యాలను సేకరించడం ద్వారా ఈ సంస్థ సంగారెడ్డి జిల్లాలోని మహిళా వ్యవసాయదారులకు అండగా నిలుస్తోంది.

అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్‌కు సంబంధించిన వంటశాలల్లో ఇంకా మెనూలో తృణధాన్యాల వాడకాన్ని గణనీయంగా పెంచుతున్నారు. తృణధాన్యాలను తినడం ద్వారా ఈ సంస్థ వైద్యులు ఆరోగ్యపరంగా చక్కని లాభాలను పొందుతున్నారు. క్రమంగా వారి ద్వారా ఆ ఆహారపు అలవాట్లు సమాజంలోని మరిన్ని వర్గాలకు చేరతాయని అపోలో హెల్త్ కేర్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) విభాగపు వైస్-చైర్మన్ శ్రీమతి ఉపాసన కొణిదెల ఒక ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొంటూ, “మహిళా వ్యవసాయదారులలో ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం మా లక్ష్యం. అందుకు అవసరమైన విద్యను, నైపుణ్యాలను వారికి అందించడం ద్వారా మహిళా వ్యవసాయదారులకు ఆరోగ్యంతో పాటు సంపదను కూడా పెంచాలన్నది మా సంకల్పం” అని తెలియజేశారు.

Upasana, millets, apollo hospitals, telangana, women farmers, sangareddy,
Upasana Talks about Millets Importance

మన ఇళ్లల్లో ఇంకా మన ఆర్థిక వ్యవస్థలో వరి ఇంకా గోధుమలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అవి సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ, వాటిని అధికంగా వినియోగించడం వల్ల జీవనశైలికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వరి పంట విషయంలో చూస్తే, కిలో వరి పండించడానికి 4000 లీటర్ల సాగునీరు అవసరం అవుతుంది. ఈ పంటల వల్ల మన భూమిలోని నీటి నిల్వలు ఎక్కువ వాడవలసి వస్తోంది. ఇది పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నది. సాగునీటి వినియోగం విషయానికి వస్తే, వరితో పోలిస్తే తృణధాన్యాల పంటలకు 25 నుండి 30 శాతం సాగు నీరు సరిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత ఆరోగ్యకరమైన జీవనం కోసం, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం తృణధాన్యాల పంటల మీద మనం దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా వాతావరణంలో మార్పులను నిరోధించవచ్చు, తద్వారా మన ఆరోగ్యాలను మెరుగుపర్చుకోవచ్చు.

తృణధాన్యాలలో ప్రొటీన్లు, పీచుపదార్థాలూ, ఇనుము, కాల్షియం పాళ్లు బియ్యంలో కంటే ఎంతో అధికంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల పోషక పదార్థాలు మన శరీరానికి ఎక్కువగా అందుతాయి. ఫలితంగా పోషకాహార లోపాల వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలను అది నిరోధిస్తుంది. తృణధాన్యాలను తినడం వల్ల ప్రజలలో మధుమేహ రోగ శాతం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. మీ ఆరోగ్యాన్నీ, అలాగే మన భూమి మీద వాతావరణ పరిరక్షణనీ దృష్టిలో ఉంచుకుని మీరు మేలయిన ఆహారపు అలవాట్లను ఎంచుకోండి! ఆరోగ్యాన్ని వృద్ధి చేసే తృణ ధాన్యాలను కొనుగోలు చేసి పోషక విలువలు ఉన్న ఆహారపదార్థాల వైపు మళ్లండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x