ఒక సంవత్సర కాలం నుండి ఓ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే కరోనా. ఈ వ్యాధి వలన ఎంతో మంది తమ జీవన వ్యవస్థని కోల్పోయి అతలాకుతలమైపోయారు. ఎక్కడ చూసినా అన్ని బంద్. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ప్రపంచ వ్యాప్తిగా ఎదురైంది లేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో, నేనింకా చావలేదు అంటూ మరలా కరోనా తన పంజా విసరడం మొదలు పెట్టింది. స్ట్రెయిన్ పేరుతో మరలా విజృంభిస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క తెలంగాణనే కాదు.. ఆంధ్రాలో కూడా ఈ వ్యాధి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 200 మార్కుని దాటినట్లు తెలుస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీ లో 210 కేసులు నమోదైనట్లు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించినట్లు ఏపీ వైద్య శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా తెలుస్తుంది. గత 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,91,388 కాగా, అందులో మరణించిన వారి సంఖ్య 7180. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,82,981 కి అని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 44,709 నమూనాలను పరీక్షించినట్లు, అందులో 1227 యాక్టివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. మొత్తంగా చూసినట్లయితే 1,44,48,650 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.