Garlic Benefits: ప్రకృతి మనకి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలల్లో వెల్లుల్లిని కూడా ఒకటిగా చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో దీనిని వెల్లి గడ్డలు అని, మరికొన్ని ప్రాంతాల్లో తెల్ల గడ్డలు అని పిలుస్తుంటారు. సహజంగా ఇందులో ఉండే ఘాటైన వాసన వలన చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. ప్రాచీన కాలం నుండి… ఇందులో ఉండే ఔషధ గుణాల వలన అనేక రకాల జబ్బుల్ని నయం చేయటానికి ఉపయోగించవచ్చు. కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
– ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బల్ని తినడం వలన చాలా ప్రయోజనాలుంటాయని చెప్తూ ఉంటారు. అలా చేయడం వలన బరువు తగ్గుతారు.
– వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
– షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఈ వెల్లుల్లిని వాడొచ్చు.
– అనేక రకాల గుండె జబ్బుల్ని ఈ వెల్లుల్లిని వాడడం ద్వారా రాకుండా నివారించవచ్చు.
– తేలు లాంటి విషపూరిత కీటకాలు కుట్టినప్పుడు ఈ వెల్లుల్లిని చితక్కొట్టి అవి కుట్టిన ప్రదేశంలో ఉంచడం వలన ప్రధమ చికిత్సలాగా ఉపయోగపడుతుంది.
– వెల్లుల్లి రొమ్ము కాన్సర్ ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
– ఈ వెల్లుల్లి మెదడు వాపు వ్యాధిని కూడా నయం చేస్తుంది.
– శీతాకాలంలో ఈ వెల్లుల్లిని వాడడం వలన నరాలకు సంబంధించిన వ్యాధుల్ని అరికట్టవచ్చు.
– ప్లేగు వ్యాధికి కూడా ఇది గొప్ప ఔషధంలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.ఇలా వెల్లుల్లితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుని ఉంటే మంచిదేగా. మరో అప్ డేట్లో వెల్లుల్లి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.