Sunday, April 6, 2025

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. వేసవిలో ఎంటర్‌టైన్‌చేయనున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్‌. ఈ టీజర్‌కు అనూహ్య స్పందన వస్తుంది. కాగా ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే… అంటూ సాగే ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. ఈటైటిల్‌ సాంగ్‌కు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించగా, శరత్‌ సంతోష్‌ ఆలపించారు. రథన్‌ స్వరాలు అందించిన ఈ పాటకు మెయిన్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీని అందించారు.
ఈ సందర్భంగా నిర్మాత హరీష్‌ మాట్లాడుతూ… ” ఎంతో యూత్‌ఫుల్‌గా కొనసాగే పాట ఇది. ఈ పాటలో హీరో, హీరోయిన్‌ ఎనర్జీ ఎంతో ప్లస్‌ అయ్యే విధంగా ఉంటుంది. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది అన్నారు.
దర్శకుడు రామ్‌ గోదాల మాట్లాడుతూ… ”.రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. పాటలోని సాహిత్యం, హీరో, హీరోయిన్‌ ఎనర్జీ, రథన్‌ సంగీతం పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకులకు కూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. సినిమాలోని ప్రతి పాత్ర ఎంతో బాగుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా రోజుల తరువాత ఓ మంచి సినిమాను చూశామనే అనుభూతికి లోనవుతారు అన్నారు.
పాటను గమనిస్తే.. ఇదొక క్యూట్‌ అండ్‌ లవ్‌లీ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. పాటలోని ప్రతి ఫేమ్‌ ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంది. సుహాస్‌, మాళవిక ఎంతో ఉత్సాహంగా కనిపించారు. రథన్‌ స్వరాలకు శ్రీహర్ష ఈమని ఎంతో చక్కటి క్యాచీ సాహిత్యాన్ని అందించారు. పాటలో హీరో, హీరోయిన్‌ డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌ కూడా అలరించే విధంగా ఉన్నాయి. టోటల్‌గా వినగానే అందరికి నచ్చే యూత్‌ఫుల్‌ సాంగ్‌ ఇది. మణికందన్‌ తన సినిమాటోగ్రఫీ ప్రతిభతో ఈ పాటను ఎంతో బ్యూటిఫుల్‌గా చిత్రీకరించాడు.
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x