బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెంబర్-౧ గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ’. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ` టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ…“నేను కూడా గతంలో కొన్ని చిత్రాలకు సమర్పకుడుగా వ్యవహరించాను. అదే బాటలో జయశంకర్ ఈ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ ట్రెడిషన్ ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా. `సౌండ్ పార్టీ` టీజర్ బావుంది. అలాగే మోహిత్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ చిత్రం మరో జాతిరత్నాలు సినిమాలా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నికి ఇది మంచి సినిమా అవుతుంది. అందరూ చేతిలో సెల్ ఫోన్, సిగరెట్ పట్టుకుని తిరుగుతుంటారు జయశంకర్ మాత్రం పుస్తకం పట్టుకుని తిరుగుతుంటాడు. ఈ క్యాలిటీ నచ్చి `పేపర్ బాయ్` సినిమా డైరక్షన్ చేసే అవకాశం ఇచ్చాను. ఈ సౌండ్ పార్టీ సినిమా అందరికీ మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నా“ అన్నారు.
నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ…“ ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తోన్న ఫుల్ ఎంటర్ టైన్మెంట్ చిత్రం ` సౌండ్ పార్టీ`. దీనికి మా టీమ్ అంతా కూడా ఎంతో సపోర్ట్ చేసింది. ప్రేక్షకులకు మా చిత్రం టీజర్ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మా టీజర్ రిలీజ్ చేసిన సంపత్ నంది గారికి కృతజ్ఞతలు. సెప్టెంబర్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ న్యూ ఏజ్ స్టోరీస్ తో సినిమాలు చేయాలన్న సంకల్పంతో ఫుల్ మూన్ ప్రొడక్షన్స్ స్థాపించాము. ఇక మీదట కంటిన్యూయస్ గా మా బేనర్ నుండి సినిమాలు వస్తాయన్నారు.
మ్యూజిక్ డైరక్టర్ మోహిత్ రెహమానిక్ మాట్లాడుతూ… “ఈ సినిమా అవకాశం రావడానికి ప్రధాన కారణం సన్నీ. అలాగే జయశంకర్ గారు, మా డైరక్టర్ సంజయ్ గారు ఎంతో సపోర్ట్ చేసి మంచి మ్యూజిక్ చేయడానికి సహకరించారు. సంతప్ నంది గారు వచ్చి మా టీజర్ లాంచ్ చేసి మా టీమ్ ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.
సమర్పకుడు జయశంకర్ మాట్లాడుతూ…“ముందుగా మా హీరో వీజే సన్నికి హ్యాపీ బర్త్ డే. ఇటీవల మా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా లాంచ్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ రోజు సంపత్ నంది గారు వచ్చి మా `సౌండ్ పార్టీ` సినిమా టీజర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం సంపత్ నంది గారు. ఆయనే నాకు దర్శకుడుగా మొదటి అవకాశాన్ని కల్పించారు. మనతో మొదటి నుండి ట్రావెల్ చేసేవాళ్లకు, మనకు తోడుగా ఉండేవాళ్లకు మనం కూడా సపోర్ట్ చేయాలని సంపత్ గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అందులో భాగంగానే ఇది నేను చేయాల్సిన సినిమా అయినా.. ప్రొడ్యూసర్స్ ని కన్విన్స్ చేసి ఈ సినిమా తమ్ముడు సంజయ్ తో చేయించాను. సినిమా చాలా బాగా వచ్చింది. సంజయ్ ఒక కొత్త తరహా కామెడీ ఈ సినిమా ద్వారా ఇంటర్ డ్యూస్ చేస్తున్నాడు. సంజయ్ కి చిన్నప్పటి నుంచి కామెడీ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాను ఆదరిస్తే ఒక జంధ్యాల, ఈవీవీ గారి తరహా చిత్రాలు సంజయ్ నుంచి చాలా వస్తాయి. సినిమాను ఇంత ఫాస్ట్ గా పూర్తి చేయగలిగాము అంటే మా టీమ్ సపోర్ట్ ప్రధాన కారణం“ అన్నారు.
దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ… “మా టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన సంపత్ నంది గారికి కృతజ్ఞతలు. మనం బాహుబలి లాంటి కథ రాసుకున్నా మన వెనకాల ఒక బలం ఉండాలి. అలాంటి బలమే జయశంకర్ అన్న. ఆయన వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఇక సౌండ్ పార్టీ మరో జాతిరత్నాలు రేంజ్ లో ఉండబోతుంది. ముఖ్యంగా సినిమాలో సన్నీ, శివన్నారాయణ గారి పాత్రలు విపరీతంగా నవ్విస్తాయి. 28 రోజుల్లో సినిమాను పూర్తి చేయగలిగాము అంటే మా టీమ్ సపోర్ట్ వల్లే“ అన్నారు.
నటుడు శివన్నారాయణ మాట్లాడుతూ… “సంజయ్ నన్ను ఊహించుకుని 2016లోనే ఈ కథ రాసుకోవడం చాలా సంతోషం. అలాగే సంజయ్ ని ఎంకరేజ్ చేస్తున్న జయశంకర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఇద్దరూ బాపూ-రమణల్లా మంచి మిత్రులు. ప్రతిది ఇద్దరూ డిస్కష్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జయశంకర్ గారు ఈ సినిమాకు బ్యాక్ బోన్ . నిర్మాతకు మాట ఇచ్చిన ప్రకారం అనుకున్న విధంగా సినిమా పూర్తి చేశారు. సన్నితో సినిమా చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇంత మంచి సినిమాలో నేను కూడా పార్ట్ కావడం సంతోషంగా ఉందన్నారు.
సింగర్ శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ…. “అందరితో కలిసి పోయే వ్యక్తిత్వం సన్నిది. తను మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. సౌండ్ పార్టీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా“ అన్నారు.
హీరో వీజే సన్ని మాట్లాడుతూ… “చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాము. జయశంకర్ సపోర్ట్ తో సంజయ్ సినిమా చాలా బాగా చేశాడు. శివన్నారాయణ గారు నేను తండ్రికొడుకులుగా నటించాం. సినిమా అంతా ఇద్దరం ఫుల్ గా నవ్విస్తాం. మోహిత్ అద్భతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అందరూ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భువన్ సాలూరు మాట్లాడుతూ… “ఈ సినిమా అనుకున్నవిధంగా రావడానికి సహకరించిన మా టెక్నీషియన్స్ కి, సపోర్ట్ చేసిన నటీనటులందరికీ ధన్యవాదాలు. సినిమా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఉంటుంది. నేను కూడా ఇందులో చిన్న పాత్ర చేశాను“ అన్నారు.
శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. : జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జయశంకర్ ; రచన – దర్శకత్వం : సంజయ్ శేరి