Sunday, December 1, 2024

‘కల్కి 2898 AD’లో ‘భైరవ’గా ప్రభాస్

విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎపిక్ సాగా ‘కల్కి 2898 AD’. మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరును ‘భైరవ’గా పరిచయం చేశారు మేకర్స్.

‘కల్కి 2898 AD’ టీమ్ సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. “కాశీ భవిష్యత్తు వీధుల నుంచి ‘భైరవ’ని పరిచయం చేస్తున్నాము” అని పేర్కొన్నారు.

ప్రభాస్ దృఢమైన శరీరాకృతితో కాల భైరవ వలె విధ్వంసకరంగా కనిపిస్తుండగా, బ్యాగ్ గ్రౌండ్ లో భవిష్యత్తు కాశీ కనిపిస్తోంది. ఆధ్యాత్మిక భూమిని అటువంటి స్థితిలో చూడటం అన్ బిలివబుల్ గా వుంది. ప్రభాస్ స్పోర్ట్స్ పోనీటైల్ తో కనిపించారు. అతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. టెక్నో షేడ్స్ ధరించడంతో పాటు చేతిపై పచ్చబొట్టు ఉంది.

కల్కి 2898 AD కథ 3101 BCEలో మహాభారత పురాణ సంఘటనల నుండి 2898 AD కాలల మధ్య వుంటుంది. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అద్భుతమైన ప్రదేశాలలో ప్రభాస్, దిశా పటానీలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్,  కమల్ హాసన్  కీలకమైన పాత్రల్లో నటిస్తున్న ఈ మైథాలజీ  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x