Sunday, December 1, 2024

శ‌ర్వానంద్ ‘శ్రీ‌కారం’ టీజ‌ర్‌: మరో ‘మహర్షి’

Sharwanand Sreekaram​ Teaser: రైతుల సమస్యలపై సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ అనే చిత్రాన్ని చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడదే దారిలో యంగ్ హీరో శ‌ర్వానంద్ నడుస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీ‌కారం’‌. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ‘నానీస్ గ్యాంగ్ లీడ‌ర్’ ఫేమ్‌ ప్రియాంకా అరుళ్ మోహ‌న్ నటిస్తోంది. 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ‘మహర్షి’ చిత్రంతో రైతుల సమస్యల గురించి చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. రైతుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సపోర్ట్ అందించారు.

మంగళవారం సాయంత్రం 4గంటల 05 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు, శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంద‌నీ, సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తూ.. చిత్రయూనిట్‌కు మ‌హేష్ బాబు శుభాకాంక్ష‌లు తెలిపారు.


ఇక టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎటువంటి కంటెంట్‌తో తెరకెక్కిందో సింపుల్‌గా చెప్పేసింది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కినట్లుగా టీజర్‌లో హీరో శ‌ర్వానంద్ చెప్పిన‌ రెండు డైలాగ్స్ చెప్పేస్తున్నాయి.

‘‘ఒక హీరో త‌న కొడుకుని హీరోని చేస్తున్నాడు.. ఒక డాక్ట‌ర్ త‌న కొడుకుని డాక్ట‌ర్‌ని చేస్తున్నాడు.. ఒక ఇంజ‌నీర్ త‌న కొడుకుని ఇంజ‌నీర్‌ని చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్ర‌మే త‌న కొడుకుని రైతుని చేయ‌డం లేదు. ఈ ఒక్క‌టీ.. నాకు జ‌వాబులేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది..’’

‘‘తినేవాళ్లు మ‌న నెత్తిమీద జుట్టంత ఉంటే, పండించేవాళ్లు మూతిమీద మీస‌మంత కూడా లేరు..’’ అనే డైలాగ్స్‌తో వచ్చిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. శ‌ర్వానంద్ మాట‌ల్ని బ‌ట్టి ఆయ‌న ఒక రైతు కొడుక‌నీ, తండ్రి బాట‌లో తాను కూడా రైతుగా మారేందుకు శ్రీ‌కారం చుట్టాడ‌నీ ఈజీగా అర్థం చేసుకోవ‌చ్చు. అయితే రైతుగా అత‌ని ప్ర‌యాణం సాఫీగా సాగిందా, ఏమైనా అడ్డంకులు ఎదుర‌య్యాయా? అస‌లు బాగా చ‌దువుకొని కూడా రైతు కావాల‌ని అత‌ను ఎందుకు నిర్ణ‌యించుకున్నాడు? అనే ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లకు సినిమా స‌మాధానం చెప్ప‌నుంది.

బుర్రా సాయిమాధ‌వ్ క‌లం ప‌నిత‌నం ఎలాంటిదో ఈ డైలాగ్స్‌తో అందరికీ మరోసారి అర్థమౌతుంది. అలాగే శ్రీ‌కారం మూవీ విజువ‌ల్ బ్యూటీగా ఉంటుంద‌నేందుకు టీజ‌ర్‌లోని విజువ‌ల్స్ ఓ శాంపిల్‌. జె. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఇక ఇదివ‌ర‌కే ‘శ్రీ‌కారం’కు సంబంధించి విడుద‌ల చేసిన ‘బ‌లేగుంది బాలా’, ‘సంద‌ళ్లె సంద‌ళ్లే సంక్రాంతి సంద‌ళ్లే..’ పాట‌లు సంగీత ప్రియుల‌ను బాగా అల‌రిస్తున్నాయి. మిక్కీ జె. మేయ‌ర్ త‌న‌కు అల‌వాటైన త‌ర‌హాలో విన‌సొంపైన బాణీలు అందించారు.

చ‌క్క‌ని క‌థాక‌థ‌నాలు, ఆక‌ట్టుకునే క్యారెక్ట‌రైజేష‌న్స్‌, ఇంప్రెసివ్ టెక్నిక‌ల్ విలువ‌ల‌తో డైరెక్ట‌ర్ కిశోర్ బి. ఈ మూవీని రూపొందిస్తున్నారు. ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న‌ రెండో చిత్రం ‘శ్రీ‌కారం’. మహాశివరాత్రి కానుకగా విడుదల కానుంది.

శ‌ర్వానంద్‌, ప్రియాంకా అరుళ్ మోహ‌న్‌, రావు ర‌మేష్‌, ఆమ‌ని, న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ‌, స‌త్య‌, స‌ప్త‌గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి
సాంకేతిక బృందం:
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: హ‌రీష్ క‌ట్టా
బ్యాన‌ర్: 14 రీల్స్ ప్ల‌స్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌
ద‌ర్శ‌కుడు: కిశోర్ బి.

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x