Friday, October 18, 2024

Bhuma Family: భూమా ఫ్యామిలీ టీడీపీని వీడనుందా..!?

టీడీపీ అధినేత చంద్రబాబుకు త్వరలోనే ఊహించని రీతిలో షాక్ తగలనుందా..? కర్నూలు జిల్లాలో ప్రముఖంగా ఉండే భూమా ఫ్యామిలీ సైకిల్ పార్టీకి టాటా చెప్పేయాలని భావిస్తోందా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే వైసీపీలోకి లేకపోతే కమలం గూటికి చేరాలని సన్నాహాలు చేస్తున్నారా..? అంటే గత నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టిచూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇందుకు సవాలక్ష కారణాలే ఉన్నాయట. ఇంతకీ ఆ కారణాలేంటి..? ఎందుకిలా..? అనేది ఈ కథనంలో చూద్దాం.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కిడ్నాప్ కేసులో హైదరాబాద్‌ పోలీసులు అడ్డంగా దొరికిపోయిన విషయం విదితమే. సుమారు రెండు వారాలకు పైగా కస్టడీలో ఉన్న ఆమె ఇటీవల రిలీజ్ అయ్యారు. ఆమెను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి భూమా కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా మౌనికా రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్‌పై బయటికొచ్చేశారు. అఖిల భర్త భార్గవ్ రామ్ కోసం ఇంకా పోలీసులు వేట సాగిస్తున్నారు.. ముందస్తు బెయిల్‌కు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే.. అఖిల అరెస్ట్ మొదలుకుని రిలీజ్ వరకూ అస్సలు ఆమె టీడీపీ నేతే కాదన్నట్లుగా ట్రీట్ చేశారు చంద్రబాబు మొదలుకుని ఆ పార్టీ నేతలంతా.!.

ఎప్పుడైతే ఆమె జైలు నుంచి బయటికొచ్చారో.. వచ్చీ రాగానే అధినేత చంద్రబాబు మొదలుకుని లోకేష్.. ఇంకా చాలా మంది నేతలు ఫోన్లు చేసి యోగ క్షేమాలు తెలుసుకుని ధైర్యంగా ఉండాలంటూ అభయమిచ్చారట. కనీసం ఆమెను అరెస్ట్ చేయడమేంటి..? అని అనడం కానీ.. చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం కానీ.. కనీసం పత్రికా ప్రకటన కూడా టీడీపీ నుంచి కానీ.. తెలంగాణ టీడీపీ నుంచి కానీ రాలేదు. మాజీ మంత్రికి పైగా తల్లిదండ్రులు లేని వారిని టీడీపీ ఇలా ట్రీట్ చేయడం ఎంతవరకు సబబు..?. ఆంధ్రాలో ఏ ఒక్క కార్యకర్తకు ఇలా జరిగిందని తెలిసినా.. మాజీ మంత్రులను కానీ.. తెలుగు తమ్ముళ్లపై ఈగ వాలినా మీడియా మీట్ పెట్టి ఊదరగొట్టే చంద్రబాబు.. అఖిల ప్రియ విషయంలో మాత్రం కనీసం ఒక్క మాట కూడా స్పందించలేదు.

ఈ పరిణామాలన్నింటితో విసిగిపోయిన భూమా ఫ్యామిలీ.. దీన్ని అవమానకరంగా భావించి టీడీపీ నుంచి బయటికెళ్లిపోవాలని.. అవసరమైతే ప్రత్యర్థి పార్టీలో అయినా సరే చేరాలే తప్ప.. ఇక్కడ మాత్రం ఇక ఉండకూడదని ఫిక్స్ అయ్యిందట. అధికార పార్టీలో అవకాశముంటే సరే.. లేకుంటే కమలం గూటికి అయినా చేరిపోవాలని కీలక నిర్ణయమే తీసుకున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే టీడీపీకి ఊహించని షాకే. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే వేచి చూడక తప్పదు మరి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x