Monday, April 21, 2025

‘మందాడి’ ఫస్ట్ లుక్ విడుదల

మిస్టర్ ఎల్రెడ్ కుమార్ నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో 16వ ప్రాజెక్ట్‌గా ‘మందాడి’ చిత్రం రానుంది. ఈ ఉత్కంఠభరితమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. తన తొలి చిత్రం ‘సెల్ఫీ’తో బలమైన ముద్ర వేసిన మతిమారన్ పుగళేంది రచన, దర్శకత్వం వహించిన ఈ ‘మందాడి’ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సూరి ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంతో తెలుగు నటుడు సుహాస్‌ను తమిళ పరిశ్రమకు గర్వంగా పరిచయం చేస్తున్నారు. మహిమా నంబియార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఏప్రిల్ 19న జరిగిన గ్రాండ్ మీడియా కార్యక్రమంలో మందాడి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. రామనాథపురం తీరప్రాంతాలలో టెస్ట్ షూట్ పూర్తయింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. ఈ చిత్రం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది. మానవ సంబంధాలను చాటేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బోట్ రేస్ అంటూ తీరప్రాంతాల్ని కళ్లకు కట్టినట్టుగా చూపించబోతోన్నారు.
మీడియా కార్యక్రమంలో చిత్రయూనిట్ సెయిల్ బోట్ రేసింగ్‌పై ఒక డాక్యుమెంట్ వీడియోను కూడా ప్రదర్శించింది. ఇది మందాడి ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. రామనాథపురం, ట్యూటికోరిన్ తీరప్రాంతాలలో మందాడి అంటే నాయకత్వం వహించే అనుభవజ్ఞుడైన నిపుణుడు అని అర్థం. సముద్ర ప్రవాహాలు, గాలి దిశలు, అలల నమూనాల గురించి అసాధారణమైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని మందాడి అని పిలుస్తారట. చేపల కదలికలను అంచనా వేయడంలో, ప్రమాదకరమైన అలలను నావిగేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ నైపుణ్యాలే అతన్ని పడవ పందెంలో తిరుగులేని నాయకుడిగా చేస్తాయి.
*రచయిత-దర్శకుడు మతిమారన్ పుగళేంది మాట్లాడుతూ… ‘ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎల్రెడ్ సర్, వెట్రి సర్‌కి థాంక్స్. నటుడిగా సూరి సర్ ఎంచుకుంటున్న పాత్రలు ప్రశంసనీయం. ఈ పాత్రను అతని కోసం రాయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సూరి సర్ దూరదృష్టి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మందాడి ఖచ్చితంగా అతని కెరీర్‌లో ఒక ప్రత్యేక మైలురాయి చిత్రంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో అతని నటన మాత్రమే కాకుండా ఆహార్యం, లుక్, మేకోవర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వెట్రి మారన్ సర్ లాంటి సృజనాత్మక నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ వెనుకాల ఉండి మాకు మార్గనిర్దేశం చేయడం ఆనందంగా ఉంది. జివి ప్రకాష్ సంగీతం, ఎస్ఆర్ కతిర్ విజువల్స్ ‘మందాడి’కి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి’ అని అన్నారు.
ఈ సినిమాకు సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్ సమకూరుస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా ఎస్.ఆర్. కతిర్ ఐ.ఎస్.సి. పని చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్. యాక్షన్ కొరియోగ్రఫీని లెజెండరీ పీటర్ హెయిన్, సౌండ్ డిజైన్‌ను ప్రతాప్ అందిస్తున్నారు. ఆర్. హరిహర సుతాన్ VFX బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.
తారాగణం: సూరి, సుహాస్, మహిమ నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచన నమిదాస్ తదితరులు
సహ నిర్మాత: వి.మణికందన్
కాస్ట్యూమ్ డిజైన్: దినేష్ మనోహరన్
డాన్స్ కొరియోగ్రాఫర్: అజర్
అదనపు రచన: R. మోహనవసంతన్ & తిరల్ శంకర్
మేకప్: ఎన్.శక్తివేల్
కాస్ట్యూమర్: నాగు
DI: క్లెమెంట్
పబ్లిసిటీ స్టిల్స్: కబిలన్
స్టిల్ ఫోటోగ్రాఫర్: జి. ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్: సౌందర్య కుంజమ్మ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎస్.పి.చొక్కలింగం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. మహేష్
PRO: సాయి సతీష్ (తెలుగు)
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x