Friday, October 18, 2024

Padma Awards: ఎస్పీ బాలు, చిత్రను వరించిన పద్మ అవార్డ్స్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2021కి గాను భారత ప్రభుత్వం సోమవారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. 119 మందికి పద్మ అవార్డులు.. ఏడుగురికి పద్మ విభూషణ్‌.. 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ప్రముఖ గాయకులు.. మరీ ముఖ్యంగా సౌత్ ప్రజలకు సుపరిచితులైన దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, గాయని చిత్ర ఉన్నారు. ఎవరెవరికి ఏయే అవార్డులు వరించాయి..? తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్ని అవార్డులు వరించాయి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

గాయకులు..
ఎస్పీ బాలసుబ్రహ్మణంకు పద్మ విభూషణ్‌ అవార్డు
గాయని చిత్రకు పద్మభూషణ్‌ అవార్డు

ప్రముఖులు ఇలా..
అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పద్మభూషణ్
మాజీ కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ పద్మభూషణ్‌
మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు పద్మభూషణ్‌
గుజరాత్‌ బీజేపీ నేత కేశూభాయ్‌కి పద్మభూషణ్‌

క్రీడా విభాగంలో ఏడుగురికి.. (పద్మశ్రీ అవార్డు)
పీ.అనిత (తమిళనాడు)
మౌమాదాస్‌ (పశ్చిమబెంగాల్‌)
అన్షు జంసేన్సా (అరుణాచల్‌ప్రదేశ్‌)
మాధవన్‌ నంబియార్‌ (కేరళ)
సుధా హరినారయణ్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌)
వీరేంద్ర సింగ్‌ (హరియాణా)
కే.వై వెంకటేశ్‌ (కర్ణాటక)

తెలుగు రాష్ట్రాలకు వరించిన పద్మశ్రీలు..
అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ (కళారంగం) పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవర ప్పాడు గ్రామం
నిడుమోలు సుమతికి పద్మశ్రీ (కళారంగం)
అసవాది ప్రకాశ్‌రావుకు పద్మశ్రీ(సాహిత్యం) అనంతపురం జిల్లా, సింగనమల మండలం కొరివిపల్లి గ్రామం.
శ్రీ కనకరాజుకు పద్మశ్రీ (కళారంగం). కొమురంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయి

కల్నల్ సంతోష్‌కు మహావీరచక్ర
గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన గుర్తింపునిచ్చింది. ఆయన త్యాగానికి ప్రతీకగా సంతోష్‌‌కు కేంద్రం మహావీరచక్ర పురస్కారం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందుకోనున్నారు.

తమిళనాడుకే ఎక్కువ!
ఇదిలా ఉంటే.. త్వరలో తమిళనాడులో ఎన్నికలున్న నేపథ్యంలో అధికంగా పద్మ అవార్డులు ఆ రాష్ట్రానికే కేంద్రం ప్రకటించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పీ బాలుకు కూడా తమిళనాడు కోటాలోనే అవార్డు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అయితే.. తెలుగు రాష్ట్రాలకు నాలుగు పద్మశ్రీ అవార్డులు వరించడం సంతోషించదగ్గ విషయమేనని చెప్పుకోవచ్చు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x