లెమన్.. తెలుగులో నిమ్మకాయ. దీని గురించి తెలియని వారుండరు. నిమ్మకాయల్ని వాడని వారుండరు. అయితే నిమ్మకాయల్లో విటమిన్ సి వలన ఎన్ని ఉపయోగాలో తెలియంది కాదు. నిమ్మకాయలను వాడటం వల్ల మన దైనందిన జీవితంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రోజు పరగడుపునే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. కానీ ఇదే నిమ్మరసం మరెన్నో రకాల వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
-వేసవికాలం వచ్చేస్తుంది. ఎండలో తిరగడం వలన వడదెబ్బ తగులుతుంది. అలాంటప్పుడు కొద్దిగా నిమ్మరసంలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
-నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తీసుకుంటే అజీర్తి అనేమాట ఉండదు.
-వేసవి తాపాన్ని తట్టుకోవడానికి కెమికల్స్ కలిసిన కూల్ డ్రింక్స్ తాగకుండా ప్రకృతి మనకి అందించిన ఈ నిమ్మకాయల్ని అందుబాటులో ఉంచుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
-నిమ్మకాయలో ఉండే సహజ సిద్దమైన యాంటీ సెప్టిక్ గుణాల వలన గుండెల్లో మంట, డయేరియా, బద్ధకం వంటి వాటికి ఇది దివ్యౌషధమనే చెప్పాలి.
-కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తరచు నిమ్మరసం తీసుకోవడం వలన త్వరగా కరిగిపోతాయి. ఒకవేళ ఆ సమస్య లేనివారు తీసుకుంటే ఎప్పటికి కిడ్నీలో రాళ్లనేవి ఉండవు.
-పళ్ళ నుండి రక్తం కారుతున్నా, నోటినుంచి దుర్వాసన వస్తున్నా.. నిమ్మరసాన్ని పుక్కిలి పట్టిస్తే ఆ సమస్యలు దూరమవుతాయి.
-ఇంకా ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం ఉండడం వలన నీరసం, ఒత్తిడి వంటివి దూరమవుతాయి.
– డైలీ నిమ్మరసం వేడి నీటితో కలిపి తీసుకుంటే చర్మం ముడతలు పడదు.
ఇవే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు నిమ్మరసం తీసుకోవడం వల్ల కలుగుతాయి. వాటన్నింటిని మరో అప్‌డేట్‌లో తెలుసుకుందాం.