అల్లం వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. కేవలం ఇది వంటకాల్లో వాడే ఒక మసాలా ఐటెం మాత్రమే కాదు. ఇందులో ఎన్నో అద్భుతమైన సుగుణాలు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఎన్నో రకాల సమస్యలకి మంచి ఔషధంగా దీనిని చెప్పవచ్చు. ఇప్పుడు అవేంటో క్లుప్తంగా తెలుసుకుందాం.
-అల్లం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బాగా దోహద పడతాయి. కనుక ప్రతి ఒక్కరూ రోజూ ఈ అల్లాన్ని వాడుతూ ఉండాలి.
-అధిక బరువు ఉన్నామని బాధపడే వారు ఈ అల్లంను రోజూ తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు.
-షుగర్ వ్యాధిగ్రస్తులు తరచూ అల్లంను వాడడం వలన బ్లడ్ లో ఉండే షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.
-కీళ్లు, కండరాలు, ఆర్ధరైటిస్‌కు సంబంధించిన నొప్పులను తగ్గించడానికి అల్లం ఉపయోగపడుతుంది.
-ఈ అల్లాన్ని టీలో కానీ, లేదా కాషాయంలా కానీ తీసుకుంటే కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
-ఒక చిన్న అల్లం ముక్కని తీసుకుని స్టవ్ పైన బాగా కాల్చి, దానికి చిటికెడు గళ్ళు ఉప్పును కలిపి బాగా నమిలితే వికారం, అజీర్ణం లాంటివి తగ్గుతాయి.
-అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారు తరచూ అల్లాన్ని వాడుతుంటే రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
-గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవారు ఒక్కసారి ఈ అల్లం టీ చేసుకుని తాగండి. అల్లం, నిమ్మరసం, తేనె కలిపి టీలాగా సేవించినట్లైతే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
చివరిగా ఒక మాట.. ఏదైనా ఔషధంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అతిగా తీసుకుంటే దుష్ప్రయోజనమే. కనుక వారంలో 3 లేదా 4 సార్లు మాత్రమే అల్లంను వాడుతూ ఉండడం వలన ప్రయోజనం తప్పకుండా ఉంటుంది.