సామాన్యులు ఎవరైనా దూరప్రయాణం చేయాలంటే ట్రైన్స్ మీదే ఆధారపడతారు. ఈ విషయం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనం కూడా చాలా సార్లు రైలు ఎక్కి ఉంటాం. సినిమాల్లో కూడా ట్రైన్ సీన్లకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడీ ట్రైన్ జర్నీ గోల ఎందుకు అని అనుమానంగా ఉందా? రైళ్ల గురించి మీకు ఓ ఆసక్తికర విషయం చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం అంతా. మనందరం కూడా చాలా సార్లు రైలు ప్రయాణాలు చేసి ఉంటాం. అల్ రైల్లో వెళ్లేటప్పుడు మనం ఎక్కిన ట్రైన్ మధ్యలో ఆగిన అనుభవఘూ అందరికీ ఎప్పుడో ఒకసారి కలిగే ఉంటుంది. స్టేషన్లో ఆగాల్సిన రైలు ఇలా ఆగడంతో రైల్వేలను, డ్రైవర్ ను తిట్టుకున్న సందర్భాలూ ఉంటాయి. అయితే ఇలా జరగడానికి ఏదో ఒక కారణం కచ్చితంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా కారణం లేకుండా ట్రైన్ ఆగదు. కదిలే ట్రైన్ ఎలాంటి కారణం లేకుండా ఆగితే.. ఇండియన్ రైల్వేస్‌కు నష్టం చాలా భారీగా ఉంటుంది. సమాచార హక్కు చట్టం ఉపయోగించి అడిగిన ఈ ప్రశ్నకు రైల్వే శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం.. డీజిల్ ఇంజిన్‌తో నడిచే ట్రైన్ ఒక్క నిమిషం ఆగిపోతే రైల్వే వ్యవస్థకు రూ.20,401 నష్టం వస్తుంది. అదే ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.20,459 నష్టం. అలాగే గూడ్స్ ట్రైన్ విషయానికి వస్తే.. డీజిల్ ట్రైన్ ఒక నిమిషం ఆగితే రూ.13,334, ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.13,392 నష్టం వస్తుంది.
ట్రైన్ ఒకసారి ఆగితే.. అది మళ్లీ స్పీడ్ పుంజుకోవడానికి కనీసం 3 నిమిషాల టైమ్ పడుతుంది. ఈ టైమ్‌లో డీజిల్ లేదా ఎలక్ట్రిసిటీ బాగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఒక్క ట్రైన్ ఆగితే.. దాని వెనుక వచ్చే అన్ని రైళ్లనూ ఆపాల్సి వస్తుంది. దీని వల్ల ఎంత నష్టం వస్తుందో మీరే లెక్కేసుకోండి. అంతేకాదు ట్రాక్ లైన్స్‌ను కూడా మళ్లీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని ట్రైన్స్ ఆలస్యం అయితే ప్రయాణికులకు మళ్లీ డబ్బులు రిఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్క ట్రైన్ అకారణంగా ఒక్క నిమిషం ఆగితే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.