Friday, October 18, 2024

సంచలన నిర్ణయం తీసుకున్న లెజెండరీ క్రికెటర్.. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై!

సౌతాఫ్రికా క్రికెట్లో నేటి తరం లెజండరీ క్రికెటర్ల పేర్లు చెబితే వాటిలో కచ్చితంగా ఉండే పేరు ఫాఫ్ డూ ప్లెసిస్. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నడూ ప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తాను టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. బుధవారం అతను చేసిన ఈ ప్రకటన ప్రపంచ క్రికెట్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. అయితే తాను తీసుకున్న నిర్ణయాన్ని డూ ప్లెసిస్ సమర్థించుకున్నాడు. తనను వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయని, ఈ కారణంగానే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కంటే వేరే నిర్ణయం తీసుకోలేమని తాను భావిస్తున్నానని, మానసికంగా రిటైర్మెంట్‌కు రెడీ అయ్యానని చెప్పాడు. కానీ ఈ రిటైర్మెంట్ తాను ఊహించినట్టు లేదని డూ ప్లెసిస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. తాను ఆస్ట్రేలియా టూర్‌ తర్వాత అసలు క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేద్దామని అనుకున్నానని.. కానీ అలా చేయడం కుదరలేదని వివరించాడు. తన జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక నుంచి తాను టీ20 క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు వివరించాడు 2021, 2022లలో జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లను దృష్టిలో పెట్టుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.

డూ ప్లెసిస్ వయసు 36. తన కెరీర్‌లో 69 టెస్టులు ఆడాడు. 2012-13 మధ్య తొలి టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతను.. తొలి మ్యాచులోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ టెస్టుల్లో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు డూ ప్లెసిస్ ఖాతాలో ఉన్నాయి. 40.02 సగటుతో మొత్తం 4163 పరుగులు పూర్తి చేశాడు. 2016లో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొత్తం 36 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అందులో 18 గెలుపులు, 15 ఓటములు ఉన్నాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x