Friday, April 4, 2025

‘మన్మథుడు’ ఆగస్టు 29న రీ-రిలీజ్

కింగ్ అక్కినేని నాగార్జున ఈ నెల 29న పుట్టినరోజు జరుపుకోనున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది బిగ్ అకేషన్. నాగార్జున బర్త్ డేకి అభిమానులతో పాటు సినీ ప్రియులకు కూడా సర్ప్రైజ్ ఇస్తున్నారు. నాగార్జున ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన్మధుడు’, నాగర్జున బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 29న రీ-రిలీజ్ అవుతుంది.
‘మన్మథుడు’ లో నాగార్జున ఒక యాడ్ ఏజెన్సీ CEO అభి పాత్రను పోషించారు. ఏవో కారణాల వలన అమ్మాయిలను ఇష్టపడని పాత్రలో అలరించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించగా, కె విజయ భాస్కర్ స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించారు.
మన్మథుడు ఆహ్లాదకరమైన వినోదం, అందమైన ప్రేమ కథ, హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసింది. ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం.
ఈ చిత్రంలో సోనాలి బింద్రే కథానాయికగా నటించగా, అన్షు మరో కథానాయికగా నటించారు. ఇందులో బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మొదలైన ప్రముఖ హాస్యనటులు అలరించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x