ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన నటి నమిత. పెళ్లి చేసుకుని కాస్త గ్యాప్ ఇచ్చింది కానీ.. ఇప్పటికీ ఆమె పేరు హాట్ టాపిక్కే. ఆమె పేరు వినబడితే.. అలెర్ట్ అవ్వడం మాత్రం పక్కా. అంతగా నమిత తన అందచందాలతో ఊపేసింది. ముఖ్యంగా బాలయ్య బాబుతో చేసిన ‘సింహా’ చిత్రంలోని సింహమంటి చిన్నోడే అనే పాట నమితను మరిచిపోనివ్వకుండా చేస్తుంటుంది. ఇక పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత, ఆ మధ్య తమిళ బిగ్ బాస్ లోనూ, అలాగే కొన్ని రియాలిటీ షోస్ లోనూ దర్శనమిచ్చింది.
ఈ షోలలో ఆమె కాస్త భారీగా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. వాస్తవానికి వెంకటేష్ జెమిని చిత్రంలో నమిత ఎంతో అందంగా, స్లిమ్‌గా కనిపించింది. ఆ తర్వాత తన శరీరంపై శ్రద్ధ పెట్టకపోవడంతో భారీగా మారిపోయింది. తన శరీరంపై కొన్ని కామెంట్స్ ఆమే స్వయంగా చేసుకుంది. తగ్గనంటే తగ్గను.. ఇలాగే ఉంటాను అని కూడా చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఏమనుకుందో ఏమిటో గానీ.. తన భారీ శరీరాన్ని తగ్గించేందుకు జిమ్‌లో భారీగా కష్టపడుతోంది.
namitha weight loss #namitha pic.twitter.com/qEfTDjirek
— tiktokbeauties (@tiktokbeauties) January 25, 2021
తాజాగా నమిత జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో నమిత చాలా వరకు తన భారీ కాయాన్ని తగ్గించింది. తను ఎంత తగ్గిందో ఫోన్‌లో చూసుకుంటుంది. ఈ వీడియోలో నమితను చూసిన వారంతా.. మళ్లీ స్లిమ్‌గా అవుతోంది. త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వవచ్చు. త్వరగా వస్తే బాగుండు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వారి కామెంట్స్ ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాల్సి ఉంది. అన్నట్లు నమిత రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలని చూస్తోంది.