రెండు రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ‘ఉప్పెన’ సినిమా వార్తే. ఎందుకంటే మెగా హీరో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ను నందమూరి హీరో లాంఛ్ చేయబోతున్నారు. మెగా, నందమూరి కలయిక అంటే అది ఎప్పుడూ హాట్ న్యూసే. అందుకే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి అంత క్రేజ్ ఏర్పడింది.
ఇప్పుడు మళ్లీ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్ర ట్రైలర్‌ను నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేస్తున్నాడని చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించడంతో ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు. వాస్తవానికి మెగా హీరోకి ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకు ముందు కూడా ఓ మెగా హీరో చిత్రానికి యంగ్ టైగర్ సపోర్ట్ చేశారు.

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ చిత్ర ఓపెనింగ్ ఫంక్షన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై క్లాప్ కొట్టారు. ఇప్పుడు సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’కు ట్రైలర్ లాంఛ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రెండు చిత్రాలకు మెగా హీరోలు కూడా అటెండ్ అయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘బాద్‌షా’ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్ కొట్టిన విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు.

మరో నందమూరి హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ రూపొందించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్ర ఓపెనింగ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇలా మెగా, నందమూరి హీరోలు సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు.