పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అలాగే మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి14న రాధే శ్యామ్ గ్లింప్స్‌ను విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి. వంశీ, ప్రమోద్, ప్రసీధలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, కన్నడ, తమిళ, మళయాలీ వెర్షన్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.
View this post on Instagram
ప్రభాస్, పూజా హెగ్డే, ప్రియదర్శి తదితరులు నటించిన ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు
దర్శకుడు: రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
పిఆర్‌ఓ : ఏలూరు శ్రీను