Reflexion: యాంకర్, నటి రష్మీ గౌతమ్ గుంటూరులో సందడి చేయనుంది. స్కిన్, స్పా, స్కిన్ క్లినిక్ స్పెషల్‌గా పేరొందిన ‘రిఫ్లెక్షన్’ బ్రాంచ్‌ని ఆమె గుంటూరులో ఓపెన్ చేయబోతోంది. గుంటూరు లక్ష్మీపురంలో ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10గంటల 41 నిమిషాలకు ‘రిఫ్లెక్షన్’స్టూడియోని రష్మీ గౌతమ్ ప్రారంబించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రష్మీతో పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు కూడా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఈ స్టూడియో ఓపెనింగ్ విషయమై రష్మీ స్పందిస్తూ.. ”హాయ్.. నేను మీ రష్మీని. ఈ నెల 12, ఉదయం 10గంటల 41 నిమిషాలకు నేను గుంటూరుకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే, ‘రిఫ్లెక్షన్’ స్కిన్, స్పా, స్కిన్ క్లినిక్ స్టూడియో ప్రారంభోత్సవం కోసం వస్తున్నాను. ఏరియా పేరు వచ్చేసి గుంటూరు లక్ష్మీపురం. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయండి. అందరినీ అక్కడ కలుసుకుంటాను..” అని పేర్కొంది.
#Reflexion spa, salon and skincare center Grand Opening by Jabardast @rashmigautam27 at laxmipuram, Guntur#feb12th 10.41 AM pic.twitter.com/RAQ7wCgGPR
— Just Teaser (@justteaserweb) February 11, 2021
ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ చేతుల మీదుగా ‘రిఫ్లెక్షన్’ స్టూడియో ప్రారంభమవుతుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ఈ స్టూడియోని గుంటూరులో ప్రారంభిస్తోన్న ‘రిఫ్లెక్షన్’ స్టూడియో ఎండీ ఆర్. భువనేశ్వరి.