Sunday, December 29, 2024

‘మ్యాడ్ స్క్వేర్’… రెండవ పాట విడుదల

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, కేవలం ప్రకటనతోనే రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘మ్యాడ్’ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ పాటలపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంది. ‘లడ్డు గాని పెళ్లి’ అంటూ ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి గీతంకి విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతంగా ‘స్వాతి రెడ్డి’ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘లడ్డు గాని పెళ్లి’ తరహాలోనే విన్న వెంటనే కట్టిపడేసేలా ఎంతో ఉత్సహంగా ఈ గీతం సాగింది.
మొదటి భాగంలో ‘కళ్ళజోడు కాలేజ్ పాప’ వంటి బ్లాక్ బస్టర్ పాటతో ఒక ఊపు ఊపిన భీమ్స్ సిసిరోలియో, ‘స్వాతి రెడ్డి’తో మరోసారి తన సత్తా చాటారు. రాబోయే రోజుల్లో ఈ పాట తెలుగునాట ఒక ఊపు ఊపడం ఖాయంగా చెప్పవచ్చు. ఉత్సాహభరితమైన సంగీతం అందించడమే కాకుండా, అంతే ఉత్సాహంగా స్వాతి రెడ్డితో కలిసి ఈ పాటను ఆలపించారు భీమ్స్. ఇక సురేష్ గంగుల సాహిత్యం ప్రేక్షకుల నాడిని పట్టుకున్నట్టుగా ఉంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు.
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ ల త్రయం మరోసారి నవ్వించడానికి వస్తున్నారు. మొదటి భాగానికి మించిన వినోదాన్ని పంచడానికి ఈ ముగ్గురు సిద్ధమవుతున్నారు. అదే ఉత్సాహం తాజాగా విడుదలైన రెండవ గీతంలోనూ కనిపించింది. ఇక ఈ పాటలో రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ఈ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై శ్రీకర స్టూడియోస్ తో కలిసి హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఫిబ్రవరి 26, 2025న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x